విశాలాంధ్ర – అనంతపురం టౌన్ : ఈనెల 11న జరగనున్న ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా చేపట్టవలసిన కార్యక్రమాలపై శనివారం జిల్లా అధికారుల సమన్వయ కమిటీ జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ ఈ బి దేవి అధ్యక్షతన జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో జరిగింది. ఈసారి ప్రజల్లో అవగాహన పెంచేందుకు కోసం ఎనిమిది రోజులపాటు అవగాహన సభలు సమావేశాలు అవగాహన ర్యాలీలు సదస్సులు నిర్వహించాలని ఉత్తమ దంపతులకు నగదు బహుమతులు ఇవ్వాలని కమిటీ నిర్ణయించింది. ప్రధానంగా వైద్య ఆరోగ్యశాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ, పంచాయతీరాజ్, మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు ప్రపంచ జనాభా దినోత్సవం ప్రచార కార్యక్రమంలో పాల్గొనాలని కమిటీ నిర్ణయించింది. ఈనెల11వ తేదీ నుండి 18వ తేదీ వరకు జరిగే ఈ కార్యక్రమాలు ప్రతిరోజు ఒక్కో శాఖ ఆధ్వర్యంలో నిర్వహించాలని నిర్ణయించారు. గ్రామస్థాయిలో పనిచేస్తున్న ఆశ అంగన్వాడి, ఏఎన్ఎం, స్వయం సహాయక సంఘాలు, పూర్తిస్థాయిలో పాల్గొనాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారులతో పాటు పంచాయతీరాజ్, ఐసిడిఎస్, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.


