Homeజిల్లాలుఅనంతపురం"సర్" డిజిటలైజేషన్ లో అలసత్వం ప్రదర్శించవద్దు

“సర్” డిజిటలైజేషన్ లో అలసత్వం ప్రదర్శించవద్దు

- Advertisement -

అన్ని రాజకీయ పార్టీ శ్రేణులు సహకరించాలి…
జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్
విశాలాంధ్ర అనంతపురం టౌన్ : ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ (సర్)ను గడువులోగా పూర్తి చేయాలని క్షేత్రస్థాయి విధుల్లో ఎలాంటి అలసత్వం ప్రదర్శించవద్దని , అన్ని పార్టీల ప్రతినిధులు ఈ ప్రక్రియకు సహకరించాలని జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ తెలిపారు. శనివారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో వివిధ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం జరుగుతున్న సర్ ప్రక్రియ పై పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో బి ఎల్ ఓ లు తమ పనితీరును మెరుగు పరుచుకొని ఓటర్ల జాబితా సవరణలో ఎటువంటి లోపాలు అవకతవకలు లేకుండా చూడాలని అన్ని రాజకీయ పార్టీలను సమానంగా పరిగణించి చట్టాలు నిబంధనలకు లోబడి పని చేయాలని స్పష్టం చేశారు. పూర్తి పారదర్శకంగా నిష్పక్షపాతంగా అప్పగించిన విధులను నిర్వర్తించాలని పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమించి అక్రమాలకు పాల్పడిన అనధికారికంగా ఓట్లను తొలగించిన ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు కఠినమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రతి ఇంటిని సందర్శించి ఎన్రోల్మెంట్ ఫారాలను అందజేయడంతో పాటు పాత ఓటర్ల జాబితాలో నమోదైన చిరునామాలో ఓటరు లేకపోతే వారి కొత్త చిరునామా వివరాలను సేకరించి నమోదు చేయాలని సూచించారు. ప్రజలు కూడా ప్రభుత్వ అవకాశాలను సద్విని యోగంచేసుకో
వాలని ప్రతి ఓటరు భాగస్వామ్యం కావాలని అలాగే ఆయా వార్డుల బిఎల్ ఏలు ఇన్చార్జిలు బిఎల్ఓకు కలిసి ఈ ప్రక్రియ పూర్తి చేసే విధంగా సహకరించాలని కోరారు. సర్ ప్రక్రియపై ప్రజల్లో ఉన్న సందేహాలను నివృత్తి చేసి మరింతగా అవగాహన కల్పించి అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు నమోదు అయ్యేలా చూడాలని ఎవరు కూడా ఓటు కోల్పోకుండా జాగ్రత్త చర్యలు తీసుకొని సర్ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. సేకరించిన ప్రతిఫరాన్ని వెంటనే డిజిటలైజేషన్ చేయాలని జిల్లా కలెక్టర్ బిఎల్ఓ లను ఆదేశించారు. గడువు సమీపిస్తున్నందున రోజువారీగా లక్ష్యాలను పెంచుకొని ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ఎనిమరేషన్ ఫారాలను పెండింగ్లో ఉంచకుండా ఓటర్ వద్ద డిజిటలైజేషన్ పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. మిగిలి ఉన్న ఫారాలను రాజకీయ పార్టీల బిఎల్ఎ లతో సమన్వయం చేసుకొని వెంటనే పంపిణీ చేయాలన్నారు వెనుకబడిన కేంద్రాలపై సూపర్వైజర్లు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. మొత్తం 20 38 5 2 7 మంది ఓటర్లకు గాను నేటికీ 81 69 81 దాకా డిజిటల్ జరిగిందన్నారు.
రేపటి రోజున ప్రత్యేకంగా ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఇంటింటికి వెళ్లి ఈ ప్రక్రియలో భాగస్వామ్యం చేసే విధంగా చర్యలు తీసుకున్నామని తెలిపారు. కొన్నిచోట్ల ఆయా పార్టీలు బిఎల్ఏ లోను ఇంతవరకు నియమించలేదని వెంటనే ఆయా కేంద్రాల్లో బిఎల్ఏ లను నియమించాలని తెలిపారు.
అనంతరం పలువురు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో కొంతమంది బి ఎల్ ఓ లు సక్రమంగా పనిచేయడం లేదని జిల్లా కలెక్టర్ దృష్టికి తెలుపగా దీనిపై జిల్లా కలెక్టర్ స్పందిస్తూ అలాంటి వారి వివరాలు ఇస్తే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ సమావేశంలో డిఆర్ఓ మాలోలఎన్నికల విభాగం డిప్యూటీ తాసిల్దార్ కనకరాజు ,ఎస్.ఏ. శామ్యూల్ బెంజిమెన్, టిడిపి పార్టీ తరఫున నారాయణస్వామి, బిజెపి రాష్ట్ర నాయకులు శ్రీనివాసులు,ఈశ్వర ప్రసాద్, వైయస్సార్సీపి సోమశేఖర్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, ఇండియన్ కాంగ్రెస్ ఇమామ్, ఆప్ మసూద్ వలి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు