మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటివరకు చత్తీస్ గఢ్ లో వరుస ఎన్ కౌంటర్లు జరిగితే… తాజాగా ఇప్పుడు జార్ఖండ్ కి సీన్ మారింది. జార్ఖండ్ లోని బొకారో జిల్లా లాల్పానియా ప్రాంతంలోని ఃలుగుః కొండల్లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఉదయం నుంచి ఆ ప్రాంతంలో కాల్పులు కొనసాగుతున్నాయి. సీఆర్పీఎఫ్ తో కలిసి రాష్ట్ర పోలీసులు నిర్వహించిన సంయుక్త ఆపరేషన్ లో ఎనిమిది మంది మావోయిస్టులు హతమయ్యారు. కాల్పులు ఇంకా కొనసాగుతున్నట్టు సమాచారం.
ఎన్ కౌంటర్ జరిగిన ఘటనాస్థలి నుంచి ఎస్ఎల్ఆర్, ఇన్సాస్, రైఫిల్స్ వంటి పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. చనిపోయిన మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్న బలగాలు వాటిని అక్కడి నుంచి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మావోయుస్టుల ఉనికి లేకుండా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గట్టి నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. మావోయిస్టులందరూ లొంగిపోవాలని… లేకపోతే ప్రాణాలతో మిగిలి ఉండరని కేంద్ర హోంమంత్రి అమిత్ షా హెచ్చరించిన సంగతి విదితమే. ఈ ఎన్ కౌంటర్ కు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.