విశాలాంధ్ర -వలేటివారిపాలెం : తల్లీ, బిడ్డ సంరక్షణే ద్యేయంగా అంగన్వాడీ కేంద్రాలు పని చేస్తాయని సూపర్వైజర్ సునీత అన్నారు. పోషణ పక్వాడ ముగింపు కార్యక్రమం వలేటివారిపాలెం మండలం శాఖవరం గ్రామంలో మంగళవారం పౌష్టికాహార ముగింపు కార్యక్రమం సీడీపీఓ శర్మి ష్ట సూచనల మేరకు సూపెర్వైజర్ సునీత ఆధ్వర్యంలో జరిగినది ఈ కార్యక్రమంలో భాగంగా పోషణ విలువలు కలిగిన ఆహరం తీసుకోవటం వలన కలుగు లాబాల గురించి గర్భవతులకి, భాలింతలకి, చిన్నారుల తల్లులకి తెలియజేస్తూ, గర్భ వతులకి 1000 డేస్ కేర్ గురించి తెలియచేస్తూ పోషణ ట్రాకర్ యాప్ లో ఎప్పటికప్పుడు వివరాలను నమోదు చేసుకుంటూ బరువు తక్కువ, స్టూడెంట్ చిల్డ్రన్స్ ను గుర్తించి వారికి తగిన పోషకాహారం అందేలాగా చూడాలని ఓబీసిటీ ఉన్న చిల్డ్రన్స్ ను గుర్తించి వారి జీవన శైలి లో మార్పు తీసుకొచ్చే విధంగా వారి తల్లులకి తగు సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగినది అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే పోషకాహారం గురించి చిన్న పిల్లల తల్లులకి తెలియచేయాలని సూచించడం జరిగినది ఈ కార్యక్రమం లో సూపర్వైజర్ సునీత, అంగన్వాడీ కార్యకర్తలు మమత, రంగమ్మ, పద్మ, పాఠశాల హెచ్ ఎం. శ్రీనివాసులు గ్రామస్థులు పాల్గొన్నారు