Friday, January 23, 2026
Homeజిల్లాలునెల్లూరుఆదర్శపాఠశాలలో బాలికల వసతి గృహంలో చేరుటకు దరఖాస్తు చేసుకోండి

ఆదర్శపాఠశాలలో బాలికల వసతి గృహంలో చేరుటకు దరఖాస్తు చేసుకోండి

- Advertisement -

ప్రిన్సిపాల్

విశాలాంధ్ర- వలేటివారిపాలెం : వలేటివారిపాలెం మండలంలోని చుండిగ్రామంలో ఉన్న చుండి ఆదర్శపాఠశాలలో ఉన్న బాలికల వసతి గృహంలో 2025-26సంవత్సరంనకు చేరుటకు 9,10,11మరియు 12తరగతి బాలికల నుంచి దరఖాస్తు కోరుతున్నట్లు ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ పడమటి శ్రీవేంకటేశ్వర్ బుధవారం ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 9,10,11మరియు 12తరగతుల బాలికలకు 50సీట్లు మాత్రమే ఉన్నాయని, రిజర్వేషన్ ప్రకారమే సీట్లు ఇవ్వడం జరుగుతుందని అన్నారు.ఆసక్తి గల బాలికలు పాఠశాల నందు ప్రిన్సిపాల్ ను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు