విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల పరిధిలోని కంబదహాల్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణితోపాధ్యాయుడుగా పని చేస్తున్న ప్రముఖ బాలసాహిత్యవేత్త ,బాలబంధు డా.గద్వాల సోమన్న 68వ పుస్తకం “సూక్తి చంద్రిక” పుస్తకావిష్కరణ శనివారం కేరళ రాష్ట్రంలోని అలువా, ఎర్నాకులం జిల్లా రాష్ట్రంలో ఘనంగా జరిగింది. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా,ఫా.సన్నీ జోసఫ్ ఇటలీ వారి సిల్వర్ జూబ్లీ మహోత్సవం సందర్భంగా ప్రావిన్షియల్ రెవ.ఫా.క్రీస్తురాజు,ఫా. సన్నీ జోసఫ్ విచ్చేసిన ప్రముఖుల చేతుల మీద పుస్తకాలను ఆవిష్కరించారు.అనంతరం అనతి కాల పరిధిలో 68 పుస్తకాలు రచించిన గద్వాల సోమన్నను సత్కరించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు యన్.జోజప్ప,ప్రభుదాస్,సుశీ రాజు,యం.జోజప్ప, చార్లెస్,జార్జి,బాలస్వామి, బి.జోసఫ్ ,రాజేష్,రత్నాకర్,అశోక్ తదితరులు పాల్గొన్నారు. సన్మాన గ్రహీత, కృతికర్త గద్వాల సోమన్న ను తోటి ఉపాధ్యాయులు, శ్రేయోభిలాషులు అభినందించారు.