Thursday, December 26, 2024
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఘనంగా ఝాన్సీ లక్ష్మీబాయి జన్మదిన వేడుకలు

ఘనంగా ఝాన్సీ లక్ష్మీబాయి జన్మదిన వేడుకలు

విశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలోని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరయోధురాలు ఝాన్సీ లక్ష్మీబాయి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని డి.ఎస్.పి ఆఫీస్ కార్యాలయంలో మహిళా కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న స్వాతిని మానవతా సేవా సంస్థ వారు ఘనంగా సన్మానించారు. సంస్థ చైర్మన్ నారాయణమూర్తి ఉపాధ్యక్షులు వేణుగోపాల్ కార్యదర్శి మంజునాథ మాట్లాడుతూ దేశ రక్షణకై చేస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం మాకెంతో సంతోషంగా ఉందని వారు తెలిపారు. నేడు మహిళలు అన్ని రంగాలలో ముందంజలో ఉన్నారని, అన్ని రకంగాలలో సమానంగా తమ పనులను చేసుకుంటూ మంచి గుర్తింపు పొందడం గర్వించదగ్గ విషయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో అకాడమిక్ డైరెక్టర్ రామకృష్ణ, సభ్యులు వెంకటేష్, డి.ఎస్.పి కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు