Thursday, December 5, 2024
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిబాలలపై జరిగే లైంగిక దాడుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. సిడిపిఓ లక్ష్మి

బాలలపై జరిగే లైంగిక దాడుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. సిడిపిఓ లక్ష్మి

విశాలాంధ్ర ధర్మవరం : బాలలపై జరిగే లైంగిక దాడుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సిడిపిఓ లక్ష్మీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా బాలల హక్కుల వారోత్సవాల సందర్భంగా జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు అధికారి సుదావరలక్ష్మి ఆదేశాల మేరకు జిల్లా బాలల పరిరక్షణ సమితి, చిల్డ్రన్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో పట్టణంలోని కొత్తపేట మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాల నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అధితిగా పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ సమాజంలో ఏదో ఒక చోట బాలలపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయని, వాటి పట్ల ప్రతి ఒక్క బాలిక జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపారు. బాలల హక్కులు జీవించే హక్కు, రక్షణ పొందే హక్కు, అభివృద్ధి చెందే హక్కు మరియు భాగస్వామ్యం హక్కులకి భంగం కలిగినట్లైతే వారిపై చట్ట పరంగా చర్యలు తీసుకోవలసి వస్తుందని తెలిపారు.పిల్లల పట్ల ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తు ఉన్నట్లు తెలిస్తే మీ తల్లిదండ్రులకి, పోలీసులకు, 1098కి ఫిర్యాదు చేయాలని తెలిపారు.బాలికలు ప్రణతి,లాస్య,బాల్య వివాహాలు ఎందుకు జరుగుతున్నాయి అనే వాటి గురించి మాట్లాడారు.పిల్లలు మంచి ప్రవర్తన కలిగి ఉన్నట్లయితే ఏ తల్లిదండ్రులు వివాహం చేయడానికి పునుకోరని మన ప్రవరనే మనలని కాపాడుతుంది అని తెలిపారు. తదుపరి పిల్లలకు బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా బాలల పరిరక్షణ సమితి రక్షణ అధికారి నాగలక్ష్మ, సీఐఎఫ్ జిల్లా కోఆర్డినేటర్ కొండప్ప,సూపర్వైసర్లు అరుణ,మనిమాల,లతకిరణ్, హెడ్మాస్టర్ మేరీ,టీచర్లు,ల రమేశ్, శారద, పాఠశాల విద్యార్థినిలు, అంగన్వాడీ వర్కర్లు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు