Thursday, December 12, 2024
Homeజిల్లాలుశ్రీ సత్యసాయినిరుపేద విద్యార్థి కుటుంబానికి ఎం ఎం డి ఏ ఆర్థిక సహాయం

నిరుపేద విద్యార్థి కుటుంబానికి ఎం ఎం డి ఏ ఆర్థిక సహాయం

విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని మారుతీ నగర్ లో నివసిస్తున్న మస్తాన్వలి, నసీన్ ల కుమారుడు సమీర్ వైద్య కోసం ఎం ఎం డి ఏ జిల్లా అధ్యక్షుడు రోషన్ జమీర్ స్పందించి, తనవంతుగా 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ సమీర్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడని, కళాశాల తరఫున హాకీ ఆడటానికి వెళ్లి, తలకు బలమైన గాయమై రక్తం గడ్డకట్టి, తీవ్ర అనారోగ్యం పాలయ్యాడన్న విషయం తమకు తెలిసిందని తెలిపారు. తల్లిదండ్రులు ఆసుపత్రికి వెళ్లడానికి డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్న సమయంలో తన వంతుగా సహాయం చేయడం జరిగిందని తెలిపారు. భవిష్యత్తులో కూడా వైద్య సహాయానికి ఎం ఎం డి ఏ తరఫున తమ సహాయ సహకారాలు అందిస్తామని వారు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాష్ట్ర అధ్యక్షులు ఇమామ్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షులు సయ్యద్ దాదా పీర్, సభ్యులు నబీజక్రియ, ఖాదర్ వలీ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు