Tuesday, December 10, 2024
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిగుండె జబ్బుల పై అప్రమత్తంగా ఉండాలి

గుండె జబ్బుల పై అప్రమత్తంగా ఉండాలి

ప్రభుత్వ వైద్య సేవలతో పాటు ఉచిత వైద్య శిబిరాలు కూడా అవసరం

ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి పరిటాల శ్రీరామ్
విశాలాంధ్ర ధర్మవరం : ప్రస్తుత సమాజంలో గుండె జబ్బులు ఎక్కువగా వస్తున్నాయని వీటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ తెలిపారు. 25వ వార్డ్ ఇంచార్జ్ భీమినేని ప్రసాద్ నాయుడు ఆధ్వర్యంలో తన అవ్వ భీమినేని నారమ్మ జ్ఞాపకార్థం ఉచిత గుండె వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఎర్రగుంట సర్కిల్ వద్ద ఉన్న శిశు సంక్షేమ కార్యాలయంలో కిమ్స్ సవేరా సహకారంతో ఏర్పాటు చేసిన ఈ వైద్య శిబిరాన్ని పరిటాల శ్రీరామ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం డిఎస్పి శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలకు ఉచితంగా గుండె పరీక్షలుచేయడంతో పాటు మందులు కూడా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలోమనిషి జీవితం యాంత్రికంగా మారుతోందని,మానసిక ఒత్తిడి కూడా బాగా పెరిగిందన్నారు. అందుకేగుండె నొప్పితో మరణాలు కూడా సంభవిస్తున్నాయని అన్నారు. గుండె జబ్బులను ముందుగానే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఇందుకు ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు ఎంతగానో దోహదపడతాయన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ వైద్య సేవలతో పాటు స్వచ్ఛంద సంస్థలు, ప్రముఖుల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం చాలా అవసరం అన్నారు. ప్రజలు తమ ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్, వైద్యులతో పాటు టిడిపి నాయకులు ,కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు