–ఘనంగా ఎన్టీఆర్ 102వ జయంతి
విశాలాంధ్ర -ఆస్పరి (కర్నూలు జిల్లా): కడపలో జరుగుతున్న 43వ మహానాడుకు టిడిపి మండల ప్రధాన కార్యదర్శి శేషాద్రి నాయుడు, యువ నాయకులు సతీష్ కుమార్, మేకల రంగనాథ్ ల ఆధ్వర్యంలో పలువురు టీడీపీ నాయకులు బుధవారం తరలి వెళ్లారు. ముందుగా స్థానిక టీడీపీ కార్యాలయంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు 102 జయంతి వేడుకలను పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలోనే మొట్టమొదటిసారిగా రెండు రూపాయల కిలో బియ్యం ప్రవేశపెట్టి పేదల మనసు దాచుకున్న ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు అని కొనియాడారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్నారు. దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం మహానాడు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా నాయకులు శ్రీనివాసులు గౌడ్, హలిగేర ఎంపీటీసీ రహింతుల్లా, యువ నాయకులు రాజకుమార్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.


