London Escorts sunderland escorts asyabahis.org www.dumanbet.live www.pinbahiscasino.com sekabet.net olabahisgir.com www.maltcasino.net www.faffbet-giris.com www.asyabahisgo1.com dumanbetyenigiris.com pinbahisgo1.com www.sekabet-giris2.com olabahisgo.com www.maltcasino-giris.com www.faffbet.net betforward1.org betforward.mobi www.1xbet-adres.com 1xbet4iran.com www.romabet1.com www.yasbet2.net 1xirani.com romabet.top 3btforward1.com 1xbet 1xbet-farsi4.com بهترین سایت شرط بندی betforward
Friday, October 18, 2024
Friday, October 18, 2024

హుజూరాబాద్‌లో నాలుగు రౌండ్ల ఫలితాలు..

హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉదయం 8 గంటల ప్రారంభమైంది. కరీంనగర్‌లోని ఎస్‌ఆర్‌ఆర్‌ డిగ్రీ కాలేజీల్లో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు జరిగాయి.
తొలి రౌండ్‌లో..
తొలి రౌండ్‌లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. ఈటల రాజేందర్‌కు 4,610 ఓట్లు పోలవ్వగా, గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌కు 4444 ఓట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థి వెంకట్‌కు 119 ఓట్లు పోలయ్యాయి.
రెండో రౌండ్‌..
రెండో రౌండ్‌ ముగిసేసరికి ఈటల రాజేందర్‌ 359 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. రెండో రౌండ్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌కు 4,659, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు 4,851, కాంగ్రెస్‌ అభ్యర్థి వెంకట్‌కు 220 ఓట్లు పోలయ్యాయి.
మూడో రౌండ్‌ పూర్తయ్యేసరికి..
మూడో రౌండ్‌ పూర్తయ్యేసరికి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ 1269 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మూడో రౌండ్‌లో ఈటల రాజేందర్‌ 4064, గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌కు 3153, కాంగ్రెస్‌ అభ్యర్థి వెంకట్‌కు 107 ఓట్లు పోలయ్యాయి. రోటీ మేకర్‌ గుర్తుకు 43 ఓట్లు, వజ్రం గుర్తుకు 22 ఓట్లు పోలయ్యాయి.
నాలుగు రౌండ్‌లో
నాలుగు రౌండ్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌కు 3,882 ఓట్లు పోలవ్వగా, బీజేపీకి 4,444 ఓట్లు, కాంగ్రెస్‌కు 234 ఓట్లు పోలయ్యాయి. నాలుగో రౌండ్‌లో బీజేపీకి 562 లీడ్‌ రాగా, నాలుగు రౌండ్లు పూర్తయ్యేసరికి ఈటల రాజేందర్‌ 1,825 ఓట్ల ముందంజలో ఉన్నారు.

హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో 30 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. టీఆర్‌ఎస్‌ నుంచి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌, కాంగ్రెస్‌ నుంచి బల్మూరి వెంకట్‌, బీజేపీ నుంచి ఈటల రాజేందర్‌ పోటీలో ఉన్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. 144 సెక్షన్‌ అమలు చేస్తున్నారు. విజయోత్సవ ర్యాలీలకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. హుజూరాబాద్‌ అసెంబ్లీ ఉప ఎన్నికలో శనివారం జరిగిన పోలింగ్‌లో ఓటర్లు భారీగా తరలివచ్చి ఓట్లేశారు. దాంతో రికార్డు స్థాయిలో 86.64 శాతం పోలింగ్‌ నమోదైంది. మొత్తం ఓట్లు 2,36,873 కాగా, ఓటు హక్కు వినియోగించుకున్న వారి సంఖ్య 2,05,236. కాగా 1,02,523(87.05 శాతం) మంది పురుషులు, 1,02,712(86.25 శాతం) మంది మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img