వాషింగ్టన్: ఇరాన్`ఇజ్రాయిల్ పరస్పరం భీకరదాడులు చేసుకుంటున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరాన్ చేతిలో అణ్వాయుధం ఉండకూడదన్నారు. ఇరాన్‌ను వదిలి వెళ్లిపోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తాను చెప్పిన విధంగా అణు ఒప్పందంపై ఈపాటికే ఇరాన్ సంతకం చేసి ఉండాల్సిందని ట్రంప్ పేర్కొన్నారు.
ప్రజల ప్రాణాలు పోతున్నా ఇరాన్ పాలకులు అణు ఒప్పందానికి అంగీకరించకపోవడం సిగ్గుచేటు అని ఆయన విమర్శించారు. ‘అమెరికా ఫస్ట్ అంటే చాలా గొప్ప విషయాల కలయిక. ఇరాన్‌కు అణ్వాయుధం లేకుండా చేయడం అనేది అందులో భాగం. అమెరికా గొప్పదని చాటి చెబుతాం’ అని ‘ట్రూత్ సోషల్’ వేదికగా ట్రంప్ వ్యాఖ్యానించారు.
చాలా పెద్దపనే చేయబోతున్నా….
తనపై ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ చేసిన వ్యాఖ్యలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్- ఇజ్రాయిల్ మధ్య కాల్పుల విరమణ చేయించేందుకే కెనడాలో జరుగుతున్న జీ7 సదస్సు నుంచి తాను ఆకస్మికంగా బయలుదేరానంటూ మెక్రాన్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండిరచారు. ప్రచార ఆర్భాటం కోసమే మెక్రాన్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని ట్రంప్ విమర్శించారు. తాను వాషింగ్టన్ డీసీకి చేరుకున్నాక ఇరాన్ – ఇజ్రాయిల్ కాల్పుల విరమణపై కసరత్తు చేస్తాననే మెక్రాన్ అంచనా తప్పు అని ట్రంప్ స్పష్టం చేశారు. ‘నేను వాషింగ్టన్‌కే తిరిగి వెళ్తున్నాను. అయితే కాల్పుల విరమణ కోసమో, శాంతి ఒప్పందం కోసమో అస్సలు కాదు. దాని కంటే చాలా పెద్దదే చేయబోతున్నాను’ అని ట్రంప్ వెల్లడిరచారు. ఈ మేరకు ‘ట్రంప్ ట్రూత్ సోషల్ పోస్ట్స్’ పేజీలో డొనాల్డ్ ట్రంప్ ఈ పోస్ట్ పెట్టారు. ‘ఇరాన్ – ఇజ్రాయిల్ మధ్య కాల్పుల విరమణను అమెరికా సాధిస్తే మేం సంతోషిస్తాం. ఈ ప్రయత్నంలో అమెరికాకు ఫ్రాన్స్ తప్పకుండా సాయం చేస్తుంది’ అని అమెరికాకు చెందిన సీఎన్ఎన్ మీడియా సంస్థకు ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ తెలిపిన నేపథ్యంలోనే ట్రంప్ పైవిధంగా స్పందించారు.
ఇరాన్ చేతిలో అణుబాంబు ఉండరాదు: ట్రంప్
RELATED ARTICLES