Saturday, June 21, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిధర్మవరం జాబ్ మేళా తేదీ మారింది

ధర్మవరం జాబ్ మేళా తేదీ మారింది

– జూలైలో జరగనున్న మెగా జాబ్ మేళా

జూన్ 24న జరగాల్సిన జాబ్ మేళా వాయిదా –నియోజకవర్గ మంత్రి ఇన్చార్జ్ హరీష్ బాబు వెల్లడి
విశాలాంధ్ర ధర్మవరం; ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో, సంస్కృతి సేవా సమితి సౌజన్యంతో ధర్మవరం పట్టణంలో భారీ స్థాయిలో నిర్వహించవలసిన మెగా జాబ్ మేళా తేదీ వాయిదా వేయబడినట్టు మంత్రి నియోజకవర్గ ఇన్‌చార్జ్ హరీష్ బాబు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ అంతకుముందుగా జూన్ 24, 2025న జరగనున్నట్టు ప్రకటించిన ఈ జాబ్ మేళా, అదే తేదీన మంత్రి కు రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ఉండడం వల్ల వాయిదా వేయడం జరిగిందని తెలిపారు. ప్రజలు, నిరుద్యోగ యువత ఎలాంటి గందరగోళానికి లోనవ్వకండి అంటూ ఆయన కోరారు. జాబ్ మేళా జూలై మొదటి వారంలో లేదా రెండవ వారంలో నిర్వహించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఖచ్చితమైన తేదీ, సమయాన్ని త్వరలో అధికారికంగా ప్రకటించనున్నట్టు హరీష్ బాబు వెల్లడించారు. మంత్రి ఆదేశాల మేరకు ఈ జాబ్ మేళా మరింత సమర్థవంతంగా, పర్యవేక్షణతో నిర్వహించబడనున్నదని ఆయన తెలిపారు. ఈ అవకాశాన్ని ఎక్కువమంది యువత ఉపయోగించుకోవాలంటూ, ముందస్తు సన్నాహాలు కొనసాగించవలసిందిగా హరీష్ బాబు యువతకు సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు