ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ నాగమద్దయ్య
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణ గ్రామీణ ప్రాంతాలలో నాటు సారాయిపై అధికంగా దాడులు నిర్వహించాలని తద్వారా సారా రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలని అనంతపురం ప్రొహిబిషన్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ నాగమద్దయ్య, పుట్టపర్తి అసిస్టెంట్ ఎక్సైజ్ సూపర్డెంట్ నరసింహులు తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ఎక్సైజ్ ప్రొహిబిషన్ స్టేషన్ ను స్టేషన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం పలు రికార్డులను కూడా వారు పరిశీలించారు. నేడు నాటు సారా విక్రయాల వలన ఎంతోమంది కుటుంబాలను నష్టపోతు మృత్యుపాలు అవుతున్నారని, చట్ట ప్రకారం నాటు సారాయిని తుది ముట్టించాలని వారు ఆదేశించారు. అదేవిధంగా మధ్యమును చట్ట ప్రకారమే విక్రయాలు జరగాలని, వేరే రకంగా జరిగితే కఠిన చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలని తెలిపారు. బ్రాందీ షాపులలో మైనర్ వాళ్లకు సరుకు అమ్మ రాదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ చంద్రమణి, సబ్ ఇన్స్పెక్టర్ చాంద్బాషా, నాగరాజు, సిబ్బంది పాల్గొన్నారు.
నాటు సారాయిపై విస్తృతంగా దాడులు నిర్వహించండి..
- Advertisement -
RELATED ARTICLES


