Homeజిల్లాలుశ్రీ సత్యసాయిడ్రగ్స్ నుండి యువతి, యువకులను కాపాడుకోవాలి..

డ్రగ్స్ నుండి యువతి, యువకులను కాపాడుకోవాలి..

- Advertisement -

స్పందన హాస్పిటల్ అధినేత డాక్టర్ బషీర్
విశాలాంధ్ర ధర్మవరం:: డ్రగ్స్ నుండి యువతి యువకులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిమీద ఉందని స్పందన హాస్పిటల్ అధినేత డాక్టర్ బషీర్ తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని డిఎస్పీ కార్యాలయంలో”డ్రగ్స్ కు సంబంధించిన యువతను కాపాడుకోవడం ఎలా?”అన్న కరపత్రాలను డీఎస్పీ హేమంత్ కుమార్ చేతులమీదుగా విడుదల చేశారు. అనంతరం డాక్టర్ బషీర్ మాట్లాడుతూ యువత మత్తుకు బానిసై భవిష్యత్తును నేడు సమాజంలో నాశనం చేసుకుంటుందని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం దూర ప్రాంతాలలో కార్పొరేట్ కళాశాలలో, పాఠశాలల్లో డబ్బులు చెల్లించి చదివిస్తున్నారు. కానీ కొన్నిచోట్ల మాదకద్రవ్యాలకు అలవాటు పడి తమ జీవితాలను బొగ్గు పాలు చేసుకుంటున్నారని తెలిపారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నేటి యువతీ యువకులు డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలను గుర్తుపెట్టుకొని ఉజ్వల భవిష్యత్తుకు పాటుపడాలని తెలిపారు. తదుపరి డ్రగ్స్ అలవాటు పై ఆందోళన ఎందుకు?, అడిక్స్ను గుర్తించడం ఎలా?, దారి తీసే పరిస్థితులు ఏవి?, విముక్తి పొందడం ఎలా?, సమాజములో మనందరి బాధ్యతలు ఏమి అన్న వాటిని వారు వివరంగా తెలియజేశారు. డ్రగ్స్ అలవాటు పడిన వారిని ఆప్యాయంగా పలకరిస్తూ వారిని మార్చే ప్రయత్నం చేయాలి అని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా డ్రగ్స్ నియంత్రణపై ఎంతో కృషి చేస్తుందని తెలిపారు. అనంతరం డిఎస్పి హేమంత్ కుమార్ మాట్లాడుతూ అనుకోకుండా అలవాటయ్యే డ్రగ్స్ వల్ల యువతి యువకుల భవిష్యత్తు అంధకారమవుతోందని తెలిపారు. కుటుంబంలోని కొంతమంది పిల్లలు మాదకద్రవ్యాలకు అలవాటు పడి తల్లిదండ్రులకు తీవ్ర మనస్థాపానికి గురిచేస్తుందన్నారు. ముఖ్యంగా 15- 24 సంవత్సరాలలోపు యువతనే టార్గెట్ చేస్తూ నగరాలలో పట్టణాలలో మత్తు పదార్థాలు విక్రయిస్తున్నారని తెలిపారు. తప్పనిసరిగా యువతి యువకులు తమ భవిష్యత్తును కాపాడుకోవడానికి మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పందన హాస్పిటల్ డాక్టర్ రుతిక్, మేనేజర్ బాబా ఫక్రుద్దీన్, దిల్దార్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు