Homeజిల్లాలుశ్రీ సత్యసాయిపట్టణ పరిశుభ్రత అందరి లక్ష్యం..

పట్టణ పరిశుభ్రత అందరి లక్ష్యం..

- Advertisement -

మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణమును పరిశుభ్రతముగా ఉంచుట అందరి లక్ష్యము అని మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు ఉదయాన్నే పట్టణంలో పారిశుద్ధ్య కార్మికులు నిర్వహిస్తున్న శానిటేషన్ను వారు ఆకిష్మకంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు వార్డుల్లో కూడా వారు పరిశీలన చేస్తూ శుభ్రత పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలను వారు అధికారులకు సిబ్బందికి వివరించారు. అనంతరం వారు మాట్లాడుతూ శానిటరీ ఇన్స్పెక్టర్లు, మేస్త్రీలు సమన్వయంతో పనిచేసి పట్టణ పరిశుభ్రతకు శ్రీకారం చుట్టాలని తెలిపారు. కాలువల్లో ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ, అనారోగ్య పాలు కాకుండా చూడాలని తెలిపారు. ప్రజలు కూడా ఎక్కడపడితే అక్కడ చెత్త వేయడం, కాలువల్లో వేయడం వల్ల మురుగునీరు పోకుండా ఉండడం, దీనివల్ల దోమలు ఉత్పత్తి అయి అనారోగ్యాలు వస్తాయని తెలిపారు. సచివాలయ శానిటరీ కార్యదర్శులు అందరూ కూడా పట్టణ పరిశుభ్రత పట్ల ఆయా వార్డుల్లో ప్రజలకు తప్పనిసరిగా అవగాహన కల్పించాలని తెలిపారు. తడి చెత్త, పొడి చెత్తను వేరువేరుగా వేయాలని సూచించారు. చెత్తను డాక్టరు లేదా మున్సిపల్ లారీల ద్వారా ఎప్పటికప్పుడు తొలగించాలని వారు శానిటరీ ఇన్స్పెక్టర్లకు సూచించారు. పట్టణ ప్రజల ద్వారా వార్డులలో ఫిర్యాదు అందితే కఠిన చర్యలు తప్పవు అని వారు హెచ్చరించారు. అనంతరం పట్టణంలోని అన్నా క్యాంటీన్లను వారు పరిశీలించారు. అన్నా క్యాంటీన్లో నిర్వహిస్తున్న పలు రికార్డులను వారు పరిశీలించారు. నేరుగా అన్నా క్యాంటీన్లో తింటున్న వారితో మాట్లాడి టిఫిన్, భోజనం నాణ్యతగా ఉందా? లేదా అన్న వివరాలను అడిగి తెలుసుకున్నారు. అన్నా క్యాంటీన్లలో కూడా పరిశుభ్రత ఎంతో అవసరమని వారు సిబ్బందికి సూచించారు. నాణ్యతగా ఉండే టిఫిన్ భోజనం ప్రజలకు వడ్డించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ శ్యామ్సన్, మేస్త్రీలు, సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు