Homeజిల్లాలుశ్రీ సత్యసాయివిద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి.. ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి

విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి.. ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం;; విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, అప్పుడే జీవితం సుఖవంతం అవుతుందని ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని కే హెచ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ కార్యక్రమo నిర్వహించారు.
కళాశాల ప్రిన్సిపాల్ డా. కె ప్రభాకర్ రెడ్డి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు . తదుపరి ప్రిన్సిపాల్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రపంచం
వ్యాప్తంగా 1989నుండి ప్రతి సంవత్సరం జూన్ 26న తేదీన మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం జరుపుకోవడం సంప్రదాయంగా మారింది అని తెలిపారు.అందులో భాగంగా విద్యార్థులు మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాల పట్ల అవగాహన కలిగించే సదుద్దేశం తో ఈ కార్యక్రమం నిర్వహించడ మైందని పేర్కొన్నారు . ప్రధానంగా యువత పై ఈ రోజుల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని; వీటికి దూరంగా ఉండాలని సూచించారు.
పాశ్చాత్య పోకడలు, టీవీ, సోషల్ మీడియా ద్వారా యువత వీటి బారిన పడుతున్నారని తెలిపారు. మాదక ద్రవ్య వినియోగం ప్రజా ఆరోగ్య సమస్య పై ముఖ్యంగా గుండెజబ్బులు,ఆత్మహత్యలు, హింస, ప్రమాదాలు…. వంటి అంశాల పెరుగుదలకు దోహదం చేస్తుందని అన్నారు.ప్రతి ఒక్కరు ఈ దుష్పరిణమాలను గ్రహించి అందరూ ఇప్పటి నుండే జాగ్రత్త పడాలని తెలియచేసారు.
ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్, డా ఎస్. చిట్టెమ్మ, ఎ. కిరణ్ కుమార్, ,డా.బి.త్రివేణి, డా ఎస్. షమీఉల్లా, ,ఎం. పుష్ప, టి.సరస్వతి, బి . ఆనంద్…. తదితర అధ్యాపక , అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు