Monday, July 21, 2025
Homeజిల్లాలుఎన్టీఆర్ జిల్లాబదిలీపై వెళ్తున్న కానిస్టేబుల్ లను సన్మానించిన ఏసీపి తిలక్….

బదిలీపై వెళ్తున్న కానిస్టేబుల్ లను సన్మానించిన ఏసీపి తిలక్….

ఆరుగురు పోలీసులు సాధారణ బదిలీ…

విశాలాంధ్ర నందిగామ:- విధి నిర్వహణలో క్రమశిక్షణతో బాధ్యత తో పనిచేసిన ప్రతి ఒక్కరికి మంచి గుర్తింపు ఉంటుందని ఏ సి పి అన్నారు విధి నిర్వహణలో భాగంగా బదిలీపై వెళ్తున్న ఆరుగురు కానిస్టేబుల్ లను స్థానిక స్టేషన్ హౌస్ ఆఫీసర్ వైవిఎల్ నాయుడు తో కలిసి స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్లో గురువారం ఆయన సన్మానించారు ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో విధి నిర్వహణలో భాగంగా ఇన్నాళ్లుగా క్రమశిక్షణ బాధ్యతతో విధి నిర్వహణలో విశేష సేవలను అందించి బదిలీపై వెళ్తున్న వారు ప్రజలకు అందించిన సేవలు నిలిచిపోతాయన్నారు మరో స్టేషన్ పరిధిలో కూడా ప్రజలకు విశేష సేవలు అందించాలని ప్రజల,అధికారుల మన్నలను పొందాలని ఫ్రెండ్లీ పోలీసుగా ఉండాలని ఆయన కోరారు మంచి నడవడిక క్రమశిక్షణతో పనిచేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక గుర్తింపు ఉంటుందని ఉన్నత పదవులు అవరోధిస్తారని అన్నారు ఈ కార్యక్రమంలో స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు…

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు