విశాలాంధ్ర- నందిగామ : నాలుగు నల్ల చట్టాలు ద్వారా కార్మికుల హక్కులను భంగం కలిగించేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దుశ్చర్యలకు పాల్పడుతున్నాయని ప్రజాసంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు బుధవారం స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద నుండి గాంధీ సెంటర్ వరకు ప్రజా సంఘాలు,సిఐటియు అనుబంధ సంస్థలు, వామపక్షాల ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికుల శ్రేయస్సును గాలికి వదిలేసి కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న నల్ల చట్టాలకు, రాష్ట్రప్రభుత్వాలు కొమ్ముకాస్తూ పేద బడుగు బలహీనవర్గాల కార్మికుల హక్కులను కాలరాస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు, కొంతమంది శ్రేయస్సు కోసమే పనిచేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులను బానిసలుగా చేసే విధంగా నాలుగు లేబర్ కోడ్లను తయారు చేసి గతంలో కార్మికులకు ఉపయోగపడే విధంగా ఉన్న చట్టాలను రద్దుచేసి,నాలుగు లేబర్ కొడ్లను అమలు చేయాలని చూస్తున్న కేంద్రప్రభుత్వం కేంద్రం అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆమోదం తెలియజేయడం చాలా దురదృష్టకరమని అన్నారు దేశవ్యాప్తంగా సంఘటిత, అసంఘటిత రంగాల్లో పనిచేసే కార్మికులకు ఉపయోగపడే విధంగా తీసుకొస్తున్న చట్టాలను వెంటనే రద్దు చేయాలని పాత పద్ధతిలోనే కార్మికుల హక్కులను కాపాడాలని అన్నారు కార్మికులకు ఎందుకు పనికిరాని చట్టాలను తీసుకువస్తూ అదేమని ప్రశ్నిస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వామపక్షాలపై ప్రజాసంఘాలపై పోలీసుల ద్వారా షరతులు విధించటం షరా మామూలు అయిందని అన్నారు కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ప్రజా సంఘాలు ఎప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటాయని పేర్కొన్నారు ధర్నాలు చేస్తే అరెస్టులు చేసే విధంగా చట్టాలను తీసుకురావడం దురదృష్టకరమని అన్నారు కార్మికుల ప్రయోజనాలను కాలరాస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై దేశవ్యాప్తంగా కార్మికులందరూ వారి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కేంద్ర కార్మిక సంఘాల పిలుపులో భాగంగా బుధవారం దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె చేస్తూ కార్మికుల ఐక్యతను కాపాడుకుంటూ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ పలు డిమాండ్లను వారు ప్రభుత్వాలకు విడుదల చేశారు నాలుగు లేబర్ కోడ్ల రద్దు వెంటనే రద్దు చేయాలని,కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలనీ,ప్రభుత్వ స్కూళ్లలో పనిచేస్తున్న ఆయా మధ్యాహ్నం భోజన పథకం నైట్ వాచ్మెన్ల కు పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలనీ,రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలనీ, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును అమలు చేయాలనీ, ప్రమాదవశాత్తు మృతి చెందిన భవన నిర్మాణ కార్మికుడికి 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలనీ,మోటార్ రంగ కార్మికులను ఇబ్బందులు గురిచేసే జీవో నెంబర్ 21ని తక్షణమే రద్దు చేయాలనీ, కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలనీ,ప్లాట్ ఫామ్ రిక్షా తోపుడుబండ్ల కార్మికులకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలనీ,ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించ రాదని,4 కార్మిక చట్టాల అమలను తక్షణమే నిలిపివేయాలనీ వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సంఘం కార్యదర్శి చుండూరు వెంకట సుబ్బారావు,సిఐటియు నాయకులు కటారపు గోపాల్,సిపిఐ నియోజకవర్గ సహాయ కార్యదర్శి కట్టా చామంతి,మండల కార్యదర్శి అంజి,నాయకులు కర్రి వెంకటేశ్వరావు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు సయ్యద్ ఖాసిం,మున్సిపల్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి దసరపు సైదా, అధ్యక్షులు సఖినేటి నరేష్, మాణిక్యం పరిమి రవి,శీను, అంగన్వాడి యూనియన్ నాయకులు కొల్లి సరళ, వెంకట్రావమ్మ,ఆశ వర్కర్స్ దేవి,వనజ,కవిత, ఆదిలక్ష్మి మధ్యాహ్న భోజనం వర్కర్లు సుశీల,తులసమ్మ,గ్యాస్ కార్మికులు బెల్లంకొండ నాగేశ్వరరావు,ముసలి,లక్ష్మి ముఠా కార్మికులు ఆటో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు….
కార్మికుల హక్కులకు నష్టం కలిగించే నల్ల చట్టాలను వెంటనే రద్దు చేయాలి…. ప్రజా సంఘాలు
- Advertisement -
RELATED ARTICLES


