Wednesday, February 18, 2026
Homeఆంధ్రప్రదేశ్దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె ధర్మవరంలో విజయవంతం

దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె ధర్మవరంలో విజయవంతం

- Advertisement -

విశాలాంధ్ర -ధర్మవరం ; దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె ధర్మవరంలో విజయవంతం అయింది. ఈ సందర్భంగా ధర్మవరంలో ప్రజా సంఘాల కార్మికులు, కర్షకులతో పాటు, స్కీం వర్కర్లు, విద్యార్థి సంఘాలు, చేనేత కార్మికులతో, సిఐటియు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి, ఎన్టీఆర్ సర్కిల్లో బహిరంగ సభ ఏర్పాటు చేశారు.ధర్మవరం సిఐటియు ఆఫీస్ వద్ద నుంచి పట్టణంలోని ప్రధాన రహదారి లందు ర్యాలీ నిర్వహించి, ఎన్టీఆర్ సర్కిల్ నందు బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు మండల కన్వీనర్ జే వి రమణ, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు డాక్టర్ ఆదిశేషు, ఏ పీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాలపల్లి పెద్దన్న, సిపిఎం సీనియర్ నాయకులు ఎస్హెచ్ భాష ,సిఐటియు మండల కో కన్వీనర్ టి,అయూబ్ ఖాన్, డి, చంద్రకళ, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు , మారుతి ,పి ఎస్ యు రాష్ట్ర అధ్యక్షులు నరేంద్ర, మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కార్మికులకు నష్టం కలిగించే నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా సమాన పనికి సమానమేత్రం ఇవ్వాలని ,కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని, కాంట్రాక్ట్ ఔర్సోర్సింగ్ విధానం రద్దు చేసి కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం ఆపాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా రైల్వే, బిఎస్ఎన్ఎల్, పోస్టల్, ఎల్ఐసి, బ్యాంకింగ్, అదేవిధంగా విశాఖ ఉక్కు ప్రైవేటు కరణ ఆపాలని, కార్మికులకు పీఎఫ్ ఈఎస్ఐ వర్తింపచేయాలని, శ్రీ సత్యసాయి జిల్లా వాటర్ వర్క్స్ వారికి పెండింగ్ వేతనాలను చెల్లించాలని ,మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల కు కనీస వేతనం అమలు చేయాలని పిఎఫ్ ఈ ఎస్ ఐ, వర్తింపచేయాలని వారి సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని తెలిపారు.అంగన్వాడి వర్కర్స్ కు గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని, అంగన్వాడీలకు ఒక యాప్ను పర్మనెంట్ చేయాలని ,కార్మికులకు ఫేస్ యాప్ రద్దు చేయాలని, రైతులకు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించా లన్నారు.గిట్టుబాటు ధర విషయంలో చట్టం చేయాలని ,ఉపాధి హామీ కార్మికులకు 200 రోజులు పని దినం కల్పించాలని, 600 రూపాయలు కూలి ఇవ్వాలని తదితర డిమాండ్లను పరిష్కరించాలని దేశ వ్యాపా సమ్మె పిలుపులో భాగంగా కార్యక్రమాన్ని నిర్వహించి ప్రభుత్వానికి నిరసన తెలపడం జరిగినదని వారి స్పష్టం చేశారు. రాబోయే కాలంలో కార్మికులకు నష్టం కలిగించే చట్టాలను రద్దు చేసే వరకు సిఐటియు ఇతర ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని వారు ప్రభుత్వానికిహెచ్చరించారు.ఈ కార్యక్రమంలో
బొగ్గు నాగరాజు, జయ ,అనిల్, ఏం బాబు, ఈశ్వరయ్య, నరేష్, ఖాదర్ బాషా, హరి, అరుణ, వేదవతి ,గంగా రత్న, చిట్టెమ్మ ,యాదవ్ వీధి సరస్వతి ,చౌడమ్మ, జయమ్మ, లక్ష్మీదేవి ,తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు