Friday, March 6, 2026
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఅంగన్వాడి కమిటీని రద్దు చేసిన సిఐటియు నాయకులు

అంగన్వాడి కమిటీని రద్దు చేసిన సిఐటియు నాయకులు

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ధర్మవరం ప్రాజెక్ట్ అంగన్వాడీ కమిటీ కమిటీని సిఐటియు కార్యాలయంలో ఏకగ్రీవంగా రద్దు చేశారు. ఈ సందర్భంగా పెద్దన్న, జేవి రమణ, అయూబ్ కాళ్లు మాట్లాడుతూ ధర్మవరం ప్రాజెక్ట్ అంగన్వాడీ కమిటీని కొన్ని అనివార్య కారణాల వలన, సిఐటియు జిల్లా కమిటీ, స్థానిక కమిటీ చర్చించి రద్దు చేస్తున్నామని వారు తెలిపారు. ప్రస్తుతం కొనసాగుతున్న అధ్యక్ష ,కార్యదర్శులతో పాటు సెక్టార్ లీడర్లను పూర్తి కమిటీని రద్దు చేయడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా త్వరలోనే నూతన ప్రాజెక్టు కమిటీని సీఐటీయూ ఆధ్వర్యంలో ప్రకటిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆదినారాయణ, హైదర్ వలీ, చంద్రకళ, గంగరత్న ,గోవిందమ్మ, వేదవతి, అరుణ, సరస్వతీ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు