Homeజిల్లాలుశ్రీ సత్యసాయిదేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు సంఘీభావం తెలిపిన ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు

దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు సంఘీభావం తెలిపిన ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం;; దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు సంఘీభావంగా ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపుతో ధర్మవరం డిపోలో ఎర్ర బాడ్జీలతో ఎట్లా యూనియన్ నాయకులు నాగార్జున రెడ్డి, డిపో అధ్యక్ష కార్యదర్శులు తిరుమలేశు, ముస్తఫా, ఏ డి సి మల్లికార్జున, నాయకులు లక్ష్మన్న రామకృష్ణ బాబు తదితరులు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొత్త లేబర్ కోళ్లను వెంటనే ఉపసంహరించుకోవాలని, ఉద్యోగ భద్రత కల్పించడానికి చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ, వాటాల ఉపసంహరణ, అమ్మకం లాంటివి వెంటనే నిలిపివేయాలని తెలిపారు. కనీస వేతనాన్ని పెంచాలని, కనీస వేతనాన్ని 26 వేలుగా నిర్ణయించాలని, ప్రతి ఐదేళ్లకు ధరల స్థాయికి అనుగుణంగా వేతనాలను పెంచాలని వారి డిమాండ్ చేశారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, కొత్త ఉద్యోగ అవకాశాలలో సృష్టించాలని, 8 గంటల పని దినాన్ని దెబ్బతీసే చర్యలను వెంటనే నిలిపివేయాలని, సమాన పనికి సమాన వేతనం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. విద్య ,ఆరోగ్యానికి బడ్జెట్ కేటాయింపులను గణనీయంగా పెంచాలని, కార్మికుల ప్రాథమిక జీవన పరిస్థితులను మెరుగుపరచడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని, వలస కార్మికుల కోసం జాతీయ విధానాన్ని రూపొందించాలని, గ్రామీణ ఉపాధి హామీ పథకం నమోనాలో నగరాలలో కూడా నిరుద్యోగులకు ఉపాధి హామీ పథకాన్ని రూపొందించాలని వారు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు