Wednesday, November 19, 2025
Homeజిల్లాలుకర్నూలుపేదల సంక్షేమమే కూట‌మి ప్రభుత్వ ధ్యేయం

పేదల సంక్షేమమే కూట‌మి ప్రభుత్వ ధ్యేయం

- Advertisement -

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వం ధ్యేయం అని మంత్రాలయం నియోజకవర్గం టిడిపి ఇంచార్జీ రాఘవేంద్రరెడ్డి, రాష్ట్ర టిడిపి తెలుగు రైతు విభాగం అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి అన్నారు. బుధవారం
మండలంపరిదిలోని గంగులపాడు,రాగిమాన్ దొడ్డి గ్రామలలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం టీడీపీ మండల అధ్యక్షుడు బసలదొడ్డి ఈరన్న అధ్వర్యంలో జరిగింది . ముందుగా నాయకులు కార్యకర్తలు కలసి గ్రామంలోని ప్రతి ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అనేవిషయం పైమహిళలును అడిగి తెలుసుకున్నారు . కొంత మంది మహిళలు తమ వార్డులల్లో కనీసం తాగునీరు లేక ఇక్కడ మహిళలు అల్లాడుపోతున్నా ఏ రాజకీయ పార్టీ నాయకులు, అధికారులు తమను పట్టించుకోవడం లేదని నాయకులను నిలదీశారు. అంతేకాకుండా గ్రామంలో సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ, వీధిదీపాలు లేక రాత్రి వేళల్లో రోడ్లపైకి రావాలన్న జనం భయ పడుతున్నారని, ఒక్కరుకూడా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు . తల్లికి వందనం పథకం కింద తమ పిల్లలకు డబ్బులు వచ్చాయన్నారు. మిగిలిన పథకాలు తమకు అందడం లేదని గ్యాస్ డబ్బులు కూడా తమ అకౌంట్లోకి జమకావడం లేదన్నారు. ఈసందర్భంగావారు మాట్లాడుతూ రాబోయే నాలుగేళ్లలో కూట‌మి ప్రభుత్వం చేపట్టబోయే కార్యక్రమాలను గ్రామస్తులకు వివరించారు.ప్రభుత్వ పథకాలు అందని లబ్ధిదారులకు అన్ని పథకాలు అందేలా చేస్తామని వారు హామీ ఇచ్చారు.ప్రజల ఆలోచనలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వ పాలన కొనసాగుతోందన్నారు. అనంతరం ముఖ్యమంత్రి సహాయనిధి కింద కల్లుకుంట గ్రామానికి చెందిన ఈడిగ ఆంజనయ్య కు 44,551 రూపాయలు,గవిగట్టు గ్రామానికి చెందిన సంజీవమ్మకు 33,000 చెక్కులను అందచేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ రాష్ట్ర నాయకులు ఏసేపు,నియోజకవర్గ టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షులు బాబురావు, సొసైటీ చైర్మన్లు మీసేవ ఆంజనేయులు, మీసేవ నరసప్ప, నాయకులు రాఘవేంద్ర రెడ్డి,మాజీ సర్పంచ్ నరసన్న, వెంకటరామిరెడ్డి, రాముడు, సోమన్న, హంపయ్య, హనుమంతు, పెద్ద హనుమంతు, రాఘవేంద్ర, సురేష్, వెంకటేశ్, ఈరన్న, లక్ష్మన్న, సత్యన్న గౌడ్, ముక్కన్న, కంబగిరి, సొంటెన్న,చెన్నకేశవ గౌడ్, ఆశన్న, ఇమ్మానియేలు అధిక సంఖ్యలో కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు