– ఏఐవైఎఫ్ , ఎన్ ఎఫ్ ఐ డబ్ల్యూ జిల్లా సమితుల డిమాండ్
విశాలాంధ్ర అనంతపురం : అనంతపురం జిల్లాలో విస్తరిస్తున్న బెల్ట్ షాపులు, మద్యం అక్రమ విక్రయాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ, ఏఐవైఎఫ్ (ఆల్ ఇండియా యువజన ఫెడరేషన్), ఎన్ ఎఫ్ ఐ డబ్ల్యు (నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ వుమెన్) అనంతపురం జిల్లా కమిటీల ఆధ్వర్యంలో గురువారం ఎక్సైజ్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించబడింది. అనంతరం జిల్లా ఎక్సైజ్ అధికారి జైనాథ్ రెడ్డి కి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏ ఐ వై ఎఫ్ రాష్ట్ర నాయకుడు జి. సంతోష్ కుమార్ మరియు ఎన్ ఎఫ్ ఐ డబ్ల్యు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీమతి పద్మావతి మాట్లాడుతూ… –“గ్రామాల నుంచి పట్టణాల వరకు బహిరంగంగా బెల్ట్ షాపులు నడుస్తున్నా సంబంధిత అధికారులు మౌనంగా ఉండటం అత్యంత నిరాశ కలిగించే విషయం. కొంతమంది రాజకీయ నాయకులు, పోలీసు అధికారులు బెల్ట్ వ్యాపారానికి ప్రత్యక్ష, పరోక్ష సహకారం అందిస్తున్నారని అనంతపురం నగరంలో ప్రధానమైన రెస్టారెంట్లో మద్యం విక్రయాలు జోరుగా సాగుతోంది 24 గంటలు అనంతపురం నగరంలో మద్యం విక్రయాలు జోరుగా సాగిస్తున్నారని ప్రజల్లో నమ్మకం నెలకొంది,” అని విమర్శించారు.
మద్యం వల్ల దుష్ప్రభావాలు
కుటుంబాల విలయం, గృహ హింసలు
పిల్లల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం
యువత పనిపై ఆసక్తి కోల్పోవడం
ఆరోగ్య సమస్యలు – కాలేయ, జీర్ణ సంబంధిత వ్యాధులు పెరుగుదల
నేరాల పెరుగుదల – దొంగతనాలు, హత్యలు, ఘర్షణలు కలుగుతాయి అన్నారు .
జిల్లాలోని అన్ని బెల్ట్ షాపులపై తక్షణమే దాడులు చేసి మూసివేయాలన్నారు.
మద్యం అక్రమ విక్రయాలపై ఎక్సైజ్ చట్టం మరియు ఐపీసీ సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేసి అరెస్టులు చేయాలన్నారు.
బెల్ట్ షాపులకు అనుమతి ఇచ్చిన లేదా అవగాహనతో సహకరించిన అధికారులపై శాఖాపరమైన విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తున్న లిక్కర్ షాపుల లైసెన్సులను రద్దు చేయాలని,
అనంతపురం జిల్లాను “బెల్ట్ షాపుల రహిత జిల్లా”గా ప్రకటించే దిశగా చర్యలు తీసుకోవాలి.
ఏ ఐ వై ఎఫ్ – ఎన్ ఎఫ్ ఐ డబ్ల్యు నేతలు హెచ్చరించారు.
“ప్రభుత్వ యంత్రాంగం వెంటనే చర్యలు తీసుకోకపోతే, బాధిత కుటుంబాలతో కలిసి బహిరంగ ప్రజా ఉద్యమాన్ని ప్రారంభిస్తామన్నారు. ఎక్సైజ్, పోలీస్ కార్యాలయాల ఎదుట నిరసనలు, ధర్నాలు నిర్వహిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో ఎన్ ఎఫ్ ఐ డబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు పార్వతి ప్రసాద్ జిల్లా సహాయ కార్యదర్శి దేవేంద్ర నగర కార్యదర్శి శ్రీనివాసులు ఎన్ఎఫ్ఐడబ్బులు నగర కార్యదర్శి జానకి అధ్యక్షురాలు యశోదమ్మ, కమక్క, ఏఐవైఎఫ్ నగర ఆఫీస్ బైరర్స్ సురేంద్ర మూజీర్, కన్న, నగేష్ నగర నాయకులు పాల్గొన్నారు.