: ఏ ఎస్ పి ఆళ్ల శ్రీనివాసులు
విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ : అబ్దుల్ కలాం మార్గదర్శకాలు విద్యార్థులు భవితకు పునాది అని ఏఎస్పీ ఆళ్ల శ్రీనివాసులు పేర్కొన్నారు. గురువారం అనంతలక్ష్మి ఇంటర్నేషనల్ స్కూల్లో విద్యార్థి నాయకులుగా ఎన్నికైనటువంటి విద్యార్థులకు పట్టాభిషేకం మహోత్సవం (ఇన్వెస్టిచర్ సెర్మనీ ) ఘనంగా నిర్వహించారు. ఏఎస్పీ , చైర్మన్ అనంత రాముడు, డైరెక్టర్ రమేష్ నాయుడు జ్యోతి ప్రజ్వలన చేసే ప్రారంభించారు. అనంతరం ఏఎస్పీ మాట్లాడుతూ.. ఓటమి జీవితంలో కొత్త పాఠాలను, అత్యున్నత శిఖరాలను అధిరోహించేందుకు మెట్లగా భావించి గమ్యాన్ని చేరుకునేందుకు నిరంతరం కృషి చేయాలి అన్నారు. విద్యార్థి దశనుండే నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవాలని.. బాధ్యత, స్ఫూర్తి, పరిశోదాత్మక అధ్యాయానికి నిదర్శనంగా నిలవాలని సూచించారు. సోషల్ మొహం వారికి దూరంగా ఉండాలని.. సాంకేతిక విజ్ఞానాన్ని వినియోగించుకోవాలి కానీ దానికి బానిసలుగా కావద్దని.. పుస్తకాలపై సమయాన్ని కేటాయిస్తే.. విజ్ఞాన మేధస్సును ఆర్జించేందుకు పదును పెట్టాలన్నారు. కళాశాల చైర్మన్ ఎం .అనంత రాముడు మాట్లాడుతూ.. విజ్ఞానం భావితరాలకు పునాది అని పేర్కొన్నారు. చిన్నతనంలోనే వినయం, విధేయత, సంస్కృతి, సంప్రదాయాలు, క్రమశిక్షణను అందిపుచ్చుకోవాలన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విద్యార్థి దశ నుండి నాయకత్వ లక్షణాలతో మార్గదర్శకంగా.. నేడు హైదరాబాద్ ఐటి హబ్, ఏపీ ఆర్థిక సూస్థిర అభివృద్ధి సాధనతో ప్రగతి పథంలో ముందుకు తీసుకువెళుతున్నారు.విద్యార్ధి నాయకులుగా ప్రజ్ఞ, మనోజ్ సాయి, ఉప నాయకులు గా రంజిత్ ,లఖీ అశ్విక,క్రీడా, సాంస్కృతిక నాయకులుగా రేహాన్
మరియు ధృతిక ఎన్నికయ్యారు. అనంతరం ఎంపికైన విద్యార్థులను అభినందించారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో.ఏ.ఓ నరసింహారావు, ప్రధానోపాధ్యాయురాలు శాలిని పాల్గొన్నారు.


