Homeజిల్లాలుఅనంతపురంవెంటనే నిరుద్యోగ భృతి అమలు చేయాలి

వెంటనే నిరుద్యోగ భృతి అమలు చేయాలి

- Advertisement -

– ఏ.ఐ.వై.ఎఫ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి సంతోష్ కుమార్ డిమాండ్

విశాలాంధ్ర -అనంతపురం : నిరుద్యోగులకు వెంటనే నిరుద్యోగ భృతి అమలు చేయాలని ఏ.ఐ.వై.ఎఫ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి సంతోష్ కుమార్ డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా ఏ.ఐ.వై.ఎఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు సోమవారం అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట భారీ నిరసన కార్యక్రమాన్ని ఏ.ఐ.వై.ఎఫ్ అనంతపురం జిల్లా సమితి నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఏ.ఐ.వై.ఎఫ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి సంతోష్ కుమార్ మాట్లాడుతూ… –“ప్రభుత్వం ఎన్నికల సమయంలో ‘సూపర్ సిక్స్’ పథకం ద్వారా నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి నిరుద్యోగ యువతికి నెలకు రూ.3,000 భృతిని వెంటనే చెల్లించాలన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని, యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలపై స్పష్టమైన రోడ్‌మ్యాప్ ప్రకటించాలన్నారు. అమరావతిని జీవితాధార కేంద్రంగా అభివృద్ధి చేసి, 26 జిల్లాల యువతకు నూతన అవకాశాలు కల్పించాలన్నారు. ప్రభుత్వం మళ్లీ యువతను మోసం చేస్తే ఊరుకునేది లేదన్నారు. హామీల అమలుపై ప్రభుత్వ స్పందన లేకపోతే, ఏ.ఐ.వై.ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు భగ్గుమంటాయి. అవసరమైతే అసెంబ్లీ ముట్టడికి కూడా ఏ.ఐ.వై.ఎఫ్ సిద్ధమే” అని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఏ.ఐ.వై.ఎఫ్.,జిల్లా ఉపాధ్యక్షులు ధనుంజయ్, దేవేంద్ర, శ్రీనాథ్ నగర అధ్యక్షుడు శ్రీనివాస్, కార్యదర్శులు ఆనంద్, రాంబాబు, లిఖిల్,ముజీర్, కన్నా, నిరుద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు