యువ నాయకులు సాంబయ్య
విశాలాంధ్ర- వలేటివారిపాలెం : సుపరిపాలన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తోనే సాధ్యమని చుండి తెలుగుదేశం పార్టీ యువ నాయకులు చెరువుపల్లి సాంబయ్య పేర్కొన్నారు. సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమంలో భాగంగా మండలం లోని చుండి గ్రామం లో నిర్వహించిన కార్యక్రమంలో చుండి టిడిపిపార్టీ యువనాయకులు చెరువుపల్లి సాంబయ్య కార్యకర్తలు, నాయకులు లతో కలిసి పాల్గొన్నారు. ముందుగా వారు ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోవడంతోపాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధిని వివరించారు. అలాగే కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంక్షేమంతోపాటు అభివృద్ధిలో దూసుకుపోతోందన్నారు. ముఖ్యంగా ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారని అన్నారు. ఆయా పథకాలపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారన్నారు. కూటమితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బొమ్మినేని మాదవరావు,జల్లి మధు, చెరువుపల్లి మల్లికార్జున,తిరుమలశెట్టి నరసింహారావు, తిరుమలశెట్టి కోటేశ్వరరావు
తదితరులు పాల్గొన్నారు.


