Sunday, July 20, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిముగిసిన గురు పూర్ణిమ మహోత్సవ వేడుకలు

ముగిసిన గురు పూర్ణిమ మహోత్సవ వేడుకలు

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని పుట్టపర్తి రోడ్డు సాయి నగర్ లో వెలసిన షిరిడి సాయిబాబా దేవాలయంలో ఈనెల 10వ, 11వ, రోజులలో (రెండు రోజులు) పాటు షిరిడి సాయిబాబా సేవా సమితి ఆధ్వర్యంలో గురుపూర్ణిమ మహోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగిందని అధ్యక్షులు వీరనారాయణ, ఉపాధ్యక్షులు నారాయణరెడ్డి, కార్యదర్శి రామలింగయ్య, ఉప కార్యదర్శి నాయుడు ,కోశాధికారి సూర్యనారాయణ, డైరెక్టర్ సూర్య ప్రకాష్ తెలిపారు.ఈ సందర్భంగా చివరి రోజు బాబాకు ప్రత్యేక పూజలను, అర్చలను అర్చకులు నిర్వహించారు. అనంతరం ఆలయ విశేషాలను భక్తాదులకు తెలియజేశారు. గురు పౌర్ణమి విశిష్టతను అర్చకులు తెలియజేశారు. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు కాకడ హారతి, అభిషేకము, బాబా కు లక్ష కుసుమర్చన, ధూప్ హారతి, సేజారతి కార్యక్రమాలను అర్చకుల ద్వారా నిర్వహించడం జరిగిందని తెలిపారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో దాదాపు 1,000 మంది పాల్గొన్నారు. అనంతరం ఆలయ కమిటీ వారు మాట్లాడుతూ ప్రతిరోజు బాబాకు నిత్య పూజలను నిర్వహిస్తున్నామని, అదేవిధంగా ప్రతిరోజు అన్నదాన కార్యక్రమంలో దాదాపు 300 మంది పేదలకు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. అదేవిధంగా మా దేవాలయంలో నూతనంగా శివాలయము నిర్మించడం జరిగిందని, ఇందులో భాగంగానే ఆంజనేయ స్వామి దేవాలయం కూడా ప్రత్యేక పూజలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులతో పాటు భక్తాదులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు