ఐదు రోజుల పాటు పర్యటన
సీఎం వెంట మంత్రుల టీమ్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనకు వెళుతున్నారు. రాష్ట్రానికి పెట్టుబడుల కోసం సీఎం చంద్రబాబుతో పాటుగా మంత్రులు, అధికారులు కూడా వెళ్తున్నారు. ఈ పర్యటనలో చంద్రబాబు నాయుడు వెంట మంత్రులు లోకేష్, నారాయణ, టీజీ భరత్, ఐటీ శాఖ కార్యదర్శి భాస్కర్ కాటమనేని, పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎస్.యువరాజ్ కూడా వెళ్తారు. సీఎం కార్యదర్శి కార్తికేయ మిశ్ర, సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు, ఆర్థిక అభివృద్ధి సంస్థ సీఈవో సాయికాంత్‌వర్మ కూడా సింగపూర్ వెళ్లే బృందంలో ఉన్నారు. ఈ నెల 26 నుంచి ఐదు రోజుల పాటు సింగపూర్‌లో పర్యటన ఉంటుంది.. ఈ బృందం ఈ నెల 30 వరకు చంద్రబాబు అండ్ టీమ్ సింగపూర్‌లో ఉంటుంది.


