జిల్లా ఎస్పీ పి. జగదీష్
విశాలాంధ్ర అనంతపురం టౌన్ : స్వర్ణ గ్రామం–స్వర్ణ వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నోషనల్ ఇంక్రిమెంట్లు, మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాలకు ప్రయోజనాలు, ప్రమోషన్ అవకాశాలు, జి ఓ నెంబర్.11 రద్దు, తదితర డిమాండ్లతో ఈనెల 27 వ తేదీన చలో విజయవాడ పిలుపుతో విజయవాడలో ధర్నా చేస్తున్నట్లు సమాచారం.ప్రభుత్వ ఉత్తర్వులు, అధికారుల ఆదేశాలను ఉల్లంఘించి అనుమతి లేని కార్యక్రమానికి వెళ్లే ఉద్యోగులపై నిబంధనల మేరకు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ శనివారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఈనేపథ్యంలో…స్వర్ణ గ్రామ మరియు స్వర్ణ వార్డు సచివాలయ ఉద్యోగులు ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ, అనుమతి లేని చలో విజయవాడ కార్యక్రమానికి వెళ్లకుండా సహకరించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.
ఈనెల 27 న …స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు ఉద్యోగులు తలపెట్టిన “చలో విజయవాడ”కు అనుమతి లేదు
- Advertisement -


