Homeజిల్లాలుఅనంతపురంవిద్యార్థులకు స్వచ్ఛతపై అవగాహన

విద్యార్థులకు స్వచ్ఛతపై అవగాహన

- Advertisement -

విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : స్వచ్ఛతే సేవ కార్యక్రమంలో భాగంగా స్థానిక నెహ్రూనగర్‌లోని పలు పాఠశాలల్లో విద్యార్థులకు స్వచ్ఛతపై అవగాహన కల్పించారు. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల లత్తవరం రోడ్డు, నెహ్రూనగర్ ప్రాథమిక పాఠశాల, జెడ్పీహెచ్‌ఎస్ సెంట్రల్ హైస్కూల్‌లో ఈ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులతో క్రీడలు నిర్వహించడంతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. తడి చెత్త, పొడి చెత్త, ప్రమాదకర చెత్తను వేర్వేరు డస్ట్‌బిన్లలో వేయాలని విద్యార్థులకు వివరించారు. అనంతరం నెహ్రూనగర్ పాఠశాలలో విద్యార్థులతో స్వచ్ఛతే సేవ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు భాస్కర్, హెచ్‌ఎం నాగరాజు, నరసింహులు, భాగ్యలక్ష్మి, సీఆర్‌పీ వన్నూరప్ప, పంచాయతీ అభివృద్ధి అధికారి అశోక్, ఏఎన్‌ఎం సుమలత, ఆశా వర్కర్లు, మేస్త్రీలు మహేష్, రామాంజినేయులు, స్వచ్ఛ భారత్ మండల కోఆర్డినేటర్ జయప్రకాష్ గౌడ్ పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు