విశాలాంధ్ర,ఉరవకొండ : ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 58వ జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) స్థాపన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
కళాశాల ప్రిన్సిపాల్ డా. టి. శైలజా రాణి అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. ఎన్ఎస్ఎస్ ప్రాంతీయ సంచాలకులు డా. రమావత్ సైదా నాయక్ వర్చువల్గా పాల్గొన్నారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు. ఎన్ఎస్ఎస్ రాష్ట్ర అధికారి డా. ఎం. సుధాకర్ మాట్లాడుతూ విద్యార్థుల్లో సేవాభావం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని తెలిపారు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ సదాశివ రెడ్డి సేవా కార్యక్రమాలను వివరించారు. విద్యార్థులు సమాజ సేవలో చురుకుగా పాల్గొనాలని డా. అదిరెడ్డి పరదేశీ నాయుడు సూచించారు. మై భారత్ ప్రతినిధి బిసాతి భరత్ ఎన్ఎస్ఎస్ ద్వారా తనకు రాష్ట్రపతి అవార్డు పొందే అవకాశం లభించిందని తెలిపారు. కార్యక్రమాన్ని ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ అధికారులు ఎం. విష్ణుప్రియ, ఎం. సుధాకర్ సమన్వయంతో నిర్వహించారు. కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా 58వ జాతీయ సేవా పథకం స్థాపన దినోత్సవం
- Advertisement -


