విశాలాంధ్ర- రాజాం (.విజయనగరం జిల్లా) : రాజాం వికాస్ తరంగణి శాఖ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ పై జి. సి.ఎస్. ఆర్. డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా విద్యార్థులను పోటి తత్వాన్ని పెంచే విధంగా టిటివి రమణమూర్తి విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం వ్యాసరచన పోటీలు నిర్వహించి విద్యార్థులకు బహుమతులు అందజేశారు మొదటి బహుమతి గెలుపొందిన విద్యార్థి ఆర్.ఎల్. గణపతి శర్మ, థర్డ్ బీకాం, ద్వితీయ బహుమతి, వై. స్నేహలత బిఎస్సీ జువాలజీ, తృతీయ బహుమతి డి.యోగ వర్ధన రావు బహుమతులు వికాస్ తరంగణి అధ్యక్షులు వాకచర్ల పైడిరాజు చేతుల మీదగా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ శ్రీమాన్ పురుషోత్తమ రావు, తెలుగు పండితులు విశ్వనాథం సభ్యులు కోరాడ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.