జిల్లా తెలుగు యువత ఆర్గనైజింగ్ కార్యదర్శి తిరుమలేష్
విశాలాంధ్ర ధర్మవరం;; ఎమ్మెస్ రాజు గురించి మాట్లాడే హక్కు వైఎస్ఆర్సిపి నాయకులకు లేదు అని జిల్లా తెలుగు యువత ఆర్గనైజింగ్ కార్యదర్శి తిరుమలేష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్ రెడ్డి అధికారంలో ఉన్నపుడు , అనంతపూర్ లో స్నేహాలత అనే అమ్మాయిని, కడపలో నాగమ్మ అనే ఒంటరి మహిళను ఎంతో కిరంతమతంగా చంపారు అని తెలిపారు. మరి ఇలాంటి ఎన్నో ఘటనలు మీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగితే చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి ఎమ్మెస్ రాజు ఆ కుటుంబాలకు న్యాయం చేయటం జరిగింది అని తెలిపారు.
అతి తక్కువ సమయంలో మడకశిర ఎంఎల్ఏ గా గెలిచి టిడిపి, టిటిడి దేవస్థాన మండలిలో సభ్యులుగా పొంది, అందరికీ న్యాయం చేయటమే లక్ష్యంగా పెట్టుకున్న మనిషి అని తెలిపారు.
నమ్మిన వారికి న్యాయం చేసే వ్యక్తి మా ఎమ్మెస్ రాజు అని వారు స్పష్టం చేశారు.
ఎమ్మెస్ రాజు గురించి మాట్లాడే హక్కు వైఎస్ఆర్సీపీ నాయకులకు లేదు..
- Advertisement -
RELATED ARTICLES


