జిల్లా ఇన్చార్జి కలెక్టర్ శివ్ నారాయన్ శర్మ
విశాలాంధ్ర -అనంతపురం : జిల్లాలో విస్తృతంగా పరిశ్రమల స్థాపన జరగాలని తద్వారా ఆర్థిక ప్రగతి సాధించవచ్చునని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ శివ్ నారాయన్ శర్మ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో 60 వ జిల్లా పరిశ్రమలు మరియు ఎగుమతి ప్రోత్సాహక కమిటీ (డి ఐ ఏ పి సి ) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంచార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పారిశ్రామిక రంగాన్ని పటిష్టం చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ఆహ్వానించి వారికి సకాలంలో సింగల్ డెస్క్ పోర్టల్ ద్వారా అన్ని రకాల అనుమతులను అందజేసి పరిశ్రమలు ఏర్పాటు చేసే విధంగా ప్రోత్సహించాలని సూచించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అమలవుతున్న పథకాల గురించి కూడా అవగాహన కల్పించాలని తెలిపారు. గత నెల లో జరిగిన సమావేశం నుంచి ప్రస్తుతం ఏక గవాక్ష విధానంలో 224ఔత్సాహికులు దరఖాస్తు చేసుకోగా 25 దరఖాస్తులను ఆమోదించారు. మిగిలిన 16 దరఖాస్తులను కూడా సత్వరమే పరిశీలించి వాటిని కూడా ఆమోదించాలని ఇన్చార్జి కలెక్టర్ ఆదేశించారు. సింగల్ విండో పోర్టల్ లోపారిశ్రామికవేత్తలు దరఖాస్తులు చేసుకున్న అనుమతులను నిర్ణిత సమయంలో ఆమోదించాలని జిల్లాలో 20 20- 20 23 మరియు 20 23- 27 పాలసీలో 13 యూనిట్లకు గాను రూ. 230 లక్షల 54,540 సబ్సిడీ మంజూరుకు సమావేశంలో ఆమోదం తెలిపారు. పీఎం ఈజీపి పథకం ద్వారా లబ్ధి పొంది విజయవంతంగా నడుస్తున్న వారి విజయగాధలు క్రోడీకరించిన వాటిని జిల్లా పరిశ్రమ శాఖ అధికారి కలెక్టర్ కు అందజేయగా దీనిపై ఇన్చార్జి కలెక్టర్ సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల శాఖ అధికారి శ్రీనివాస్ యాదవ్, ఏడి రాజశేఖర్ రెడ్డి, వాణిజ్య శాఖ కృష్ణారెడ్డి, ఆర్టీవో వీర్రాజు, ఏపీఐఐసీ మేనేజర్
మల్లికార్జున, డిఎస్ డి ఓ ప్రతాప్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
పరిశ్రమల స్థాపన వల్లనే ఆర్థిక ప్రగతి సాధ్యం
- Advertisement -


