Homeజిల్లాలుఅనంతపురంనిందితులను వెంటనే అరెస్ట్ చేయాలి

నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలి

- Advertisement -


పోలీస్ స్టేషన్ ఎదుట బాధితుల ధర్నా ……

విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా) : మండల కేంద్రంలో గత వారం చోటుచేసుకున్న హత్యాయత్నం ఘటనలో నిందితులను వెంటనే అరెస్ట్ చేసి తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం పోలీస్ స్టేషన్ ఎదుట బాధితులు, వారి బంధువులతో కలిసి ధర్నా నిర్వహించారు.బాధితురాలు రమాదేవి తెలిపిన వివరాల ప్రకారం.. నార్పలకు చెందిన పాముల రాజా తన కుమార్తెను కడప జిల్లా లింగాల మండలం తాతిరెడ్డిపల్లికి చెందిన శివయ్య కుమారుడు చరణ్‌కుమార్‌కు ఏడాది క్రితం వివాహం చేశారు. భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తడంతో రమాదేవి ప్రసవం కోసం పుట్టింటికి వచ్చింది. ప్రసవం అనంతరం భార్య, శిశువును చూడటానికి వారం రోజుల క్రితం చరణ్‌కుమార్ తన తండ్రి, స్నేహితుడితో కలిసి నార్పలకు వచ్చాడు.ఈ సందర్భంగా భార్యాభర్తల మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకోగా, ఆవేశానికి లోనైన చరణ్‌కుమార్ తన వెంట తెచ్చుకున్న వేట కొడవలితో రమాదేవిపై దాడికి యత్నించినట్లు ఆమె ఆరోపించింది. అడ్డుకునేందుకు వచ్చిన తన తండ్రి పాముల రాజాపై కొడవలి వేటు పడటంతో ఆయన చేతికి గాయమైనట్లు తెలిపింది.
దాడి అనంతరం పరారయ్యేందుకు యత్నించిన చరణ్‌కుమార్, అతని తండ్రి, స్నేహితుడిని బాధిత కుటుంబ సభ్యులు వెంబడించి పట్టుకుని పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు. అయితే పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నట్లు తీసుకుని అనంతరం వదిలేశారని ఆరోపించారు.ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన బాధితులు, వారి బంధువులు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించి నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం స్థానిక ఎస్సై సాగర్ స్పందించి నిందితులను అరెస్ట్ చేసి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో వారు ధర్నాను విరమించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు