విశాలాంధ్ర -నార్పల (అనంతపురం జిల్లా ): మండల పరిధిలోని మంగపట్నం గ్రామంలో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో తాగునీటి సమస్య రోజురోజుకూ తీవ్రతరమవుతోంది. గ్రామంలోని పంచాయతీ బోర్లన్నింటినీ సత్యసాయి వాటర్ ట్యాంకుకు అనుసంధానం చేసి, అక్కడి నుంచి నీటిని సరఫరా చేస్తే సమస్యను కొంతమేర అధిగమించవచ్చని గ్రామస్థులు కోరుతున్నారు.ప్రస్తుతం పంచాయతీ పైపులైన్ ద్వారా నేరుగా గ్రామానికి నీటిని సరఫరా చేస్తున్నప్పటికీ, కొందరు పైపులైన్లకు మోటార్లు ఏర్పాటు చేసి అధికంగా నీటిని వినియోగిస్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. దీనివల్ల నీటి వృథా పెరిగి, గ్రామంలోని ఇతర ప్రాంతాలకు తగినంత నీరు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, గ్రామంలోని పంచాయతీ బోర్లను సత్యసాయి వాటర్ ట్యాంకుకు అనుసంధానం చేసి నీటి సరఫరాను క్రమబద్ధీకరించాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేశారు. అలాగే నీటి దుర్వినియోగాన్ని అరికట్టేందుకు చర్యలు చేపట్టి, ప్రతి ఇంటికి సమానంగా నీరు అందేలా చూడాలని కోరుతున్నారు.
తాగునీటి కోసం తంటాలు పడుతున్న మంగపట్నం వాసులు……
- Advertisement -
RELATED ARTICLES


