పెంచిన బీహారు ప్రభుత్వం!
APUWJ హర్షం!
విశ్రాంత పాత్రికేయుల పింఛను పథకంలో చెల్లిస్తున్న నెలవారీ పింఛను 6 వేల రూపాయల నుండి 15 వేల రూపాయలకు పెంచుతూ బీహారు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ జులై 26 వ తేదీ ఉదయం ఆదేశాలు జారీ చేశారు. దీనిపై APUWJ హర్షం వ్యక్తం చేసింది.
బీహారు వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్( IJU అనుబంధం) చేసిన సుదీర్ఘ పోరాటం ఫలితంగా
లాలూ ప్రసాద్ యాదవ్ హయాంలో పింఛను పథకం ప్రారంభం అయ్యింది. తొలుత 1500 రూపాయలతో మొదలైన ఈ పథకంలో చెల్లించే మొత్తం దఫాదఫాలుగా పెరుగుతూ ఆరు వేలకు చేరింది.
గత మూడేళ్లుగా బీహార్ యూనియన్ చేసిన పోరాట ఫలితంగా ఆ మొత్తాన్ని 15 వేలకు పెంచుతూ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈరోజు ఆదేశాలు జారీ చేశారు.
పింఛను పొందుతూ మృతిచెందిన వర్కింగ్ జర్నలిస్టు జీవిత భాగస్వామి కి ఇచ్చే పింఛను మొత్తాన్ని కూడా మూడు వేల రూపాయల నుండి 10 వేల రూపాయలకు పెంచారు.
బీహార్ ప్రభుత్వ నిర్ణయం హర్షణీయం. బీహార్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ కు అభినందనలు.
విశ్రాంత పాత్రికేయులకు వారి సేవలకు గుర్తింపుగా పింఛను మంజూరు చేయాలన్న తమ చిరకాల డిమాండ్ ను కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా అంగీకరించాలని ఏలూరులో శనివారం జరిగిన APUWJ రాష్ట్ర కార్యవర్గ సమావేశం డిమాండ్ చేసింది.


