Tuesday, November 18, 2025
Homeఆంధ్రప్రదేశ్ప్రత్యామ్నాయ సాంస్కృతిక విధానం అవసరం

ప్రత్యామ్నాయ సాంస్కృతిక విధానం అవసరం

- Advertisement -

-సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్, నల్లూరు వెంకటేశ్వర్లు ( అన్న)
ఒంగోలు ఫోటో. సమావేశంలో మాట్లాడుతున్న అజయ్ కుమార్
విశాలాంధ్ర -ఒంగోలు మంచి సమాజం ఏర్పడాలంటే ప్రత్యామ్నాయ సాంస్కృతిక విధానం అవసరమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్, ప్రజానాట్యమండలి రాష్ట్ర గౌరవాధ్యక్షులు నల్లూరి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. శనివారం ఒంగోలు లోని మల్లయ్య లింగం భవన్లో జరిగిన ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యవర్గ సమావేశం బాపట్ల ప్రజానాట్యమండలి అధ్యక్షులు చంద్రనాయక్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా అజయ్ కుమార్, నల్లూరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పాలకుల విధానాల వలన అనేక వినాశకర విధానాలు పెరిగిపోయాయని ఈ నేపథ్యంలో ప్రజా కళాకారులు తమ కళారూపాలతో ప్రజల్ని జాగృతం చెయ్యాలని పిలుపునిచ్చారు. ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చంద్రనాయక్, చిన్నం పెంచలయ్యలు మాట్లాడుతూ ఆగస్టు 20 నుండి 25వ తేదీ వరకు ఒంగోలులో ప్రజా కళా ఉత్సవాలు నిర్వహించనున్నట్లు వారి వెల్లడించారు.ఈ కార్యక్రమంలో వెయ్యి మంది కళాకారులు 100 గొంతుకలు నినాదంతో ఈ కార్యక్రమము సాగుతుందన్నారు. అనేక జానపద గ్రామీణ కళాకారులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారని, అలాగే నాటక సినీ రంగ ప్రముఖులు హాజరవుతున్నారని పేర్కొన్నారు. నిత్యం ప్రజల మధ్య పని చేస్తున్న ప్రజా కళాకారులు పాల్గొంటున్నారని తెలిపారు. ప్రకాశం జిల్లా సిపిఐ కార్యదర్శి ఎంఎల్ నారాయణ, సహాయ కార్యదర్శి ఆర్ వెంకట్రావు మాట్లాడుతూ సమాజ జాగృతిలో కళాకారులు కీలకమైన పాత్ర పోషించాలన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి ఆర్ రామకృష్ణ, ఆర్ పిచ్చయ్య,వి నాగరాజు, ఎస్ గుర్రప్ప,ఎస్కే నజీర్, ఆరేటి రామారావు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు