Sunday, February 8, 2026
Homeజిల్లాలుకర్నూలుఆగస్టు 9,10,11 తేదీలలో జరుగు సీపీఐ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలి

ఆగస్టు 9,10,11 తేదీలలో జరుగు సీపీఐ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలి

- Advertisement -

ఆగస్టు 9,10,11 తేదీలలో కర్నూలులో జరుగు సీపీఐ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలి
విశాలాంద్ర కర్నూలు : కర్నూలులో ఆగస్టు 9,10,11 జరుగు సీపీఐ 24వ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి బి గిడ్డయ్య తెలిపారు. ఆదివారం ఆయన విశాలాంధ్రతో మాట్లాడుతూ కర్నూలు జిల్లా కేంద్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న జిల్లా మహాసభలను నగరంలోని పున్నమి ఫంక్షన్‌ హాలులో చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.9వ తేదిఉదయం 11 గంటలు ర్యాలీ ప్రారంభమైన , పాతబస్టాండ్‌లోని అంబేద్కర్‌ సర్కిల్‌ వద్ద బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుందన్నారు. అనంతరం రెండురోజులు ప్రతినిధుల సభ జరుగుతుందన్నారు. ఈ మహాసభలకు సీపీఐ రాష్ట్రకార్యదర్శి కె రామకృష్ణ, రాష్ట్రకార్యదర్శి వర్గ సభ్యులు పీ రామచంద్రయ్యలు ఈ సమావేశంలో పాల్గొంటారన్నారు.ఈ మహాసభల సందర్భంగా ప్రజానాట్యమండలి కళాకారుల డప్పుచప్పులు కళాటాలు పెద్దఎత్తున ప్రదర్శన నిర్వహించడం జరుగుతుందన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు