Homeజిల్లాలుఅనంతపురంనష్టపోయిన చీని తోటల రైతులను వెంటనే ఆదుకోవాలి ..సిపిఐ రాష్ట్ర కార్యదర్శి...

నష్టపోయిన చీని తోటల రైతులను వెంటనే ఆదుకోవాలి ..సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి, ఈశ్వరయ్య

- Advertisement -

విశాలాంధ్ర-శింగనమల: సిపిఐ, రైతు సంఘం ల అనంతపురం జిల్లా సమితి ఆధ్వర్యంలో శింగనమల నియోజకవర్గంలోని గార్లదిన్నె మండలం పాపినేపాల్యం గ్రామంలో అడుగంటి ఎండిపోయిన చీని రైతు పొలాలను నాయకులు, రైతులతో కలిసి పరిశీలించారు. ఈ పంట పరిశీలన కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనంతపురం జిల్లాను హార్టికల్చర్ హబ్‌గా మారుస్తామని, పండ్ల తోటలకు రక్షణ నిధులు అందిస్తామని, చీని-టమోటా పండ్ల రసాల ఫ్యాక్టరీలు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఆచరణలో ఫలితం కనిపించడం లేదన్నారు. పాపినేపాల్యం గ్రామంలో రైతుల పరిస్థితి అత్యంత దారుణంగా మారిందని, తాగునీరు కూడా లేని పరిస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తం చేశారు.ఏడు నుంచి ఎనిమిదేళ్లుగా చిన్నపిల్లలను పెంచినట్లు చీని తోటలను సంరక్షిస్తూ లక్షల రూపాయలు ఖర్చు చేసి బోర్లు వేసినా, ఇప్పుడు కళ్లముందే చెట్లు ఎండిపోతుండటంతో రైతులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని తెలిపారు. ఐదువందల నుంచి వెయ్యి అడుగుల లోతు వరకు బోర్లు వేసినా నీటి చుక్క రాక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.మిడ్ పెన్నార్, హంద్రీనీవా ప్రాజెక్టుల ద్వారా సాగు, తాగునీరు సమృద్ధిగా అందిందని ప్రభుత్వం ప్రచారం చేస్తోందని, కానీ గ్రామాల్లో చెరువులు, కుంటలు నింపిన పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదన్నారు. పశువులకు కూడా నీరు దొరకని పరిస్థితి నెలకొనడంతో రైతులు మండల కేంద్రాల నుంచి డబ్బులు పెట్టి మినరల్ వాటర్ కొనుగోలు చేసి పశువుల దాహం తీర్చాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.రైతులు ఒక ట్యాంకర్ నీటికి రూ.1500 నుంచి రూ.2000 వరకు ఖర్చు చేసి చీని తోటలకు రక్షిత తడులు అందిస్తున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి ఉచితంగా ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ స్పందించి ఉద్యాన, వ్యవసాయ శాఖ అధికారులను గ్రామాలకు పంపించి కరువు అంచనా నివేదికలు తయారు చేసి నష్టపరిహారం అందించాలని కోరారు.సిపిఐ జిల్లా కార్యదర్శి పాల్యం నారాయణస్వామి మాట్లాడుతూ రైతులు తీవ్ర కష్టాల్లో ఉన్నా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం బాధాకరమన్నారు. నష్టపోయిన రైతుల జాబితాను వెంటనే సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదిక పంపి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సంఘం ప్రధాన కార్యదర్శి మల్లికార్జున, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి జె. రాజారెడ్డి, టి. నారాయణస్వామి, పీ. రామకృష్ణ, డి. చిన్నప్ప యాదవ్, కుల్లాయి స్వామి, ఎం.డి. రాముడు, చేనేత మధు, మునిస్వామి, తిరుపతయ్య, శ్రీనివాసులు, జగన్నాథం, అంజినప్ప, తాతయ్యతో పాటు పెద్ద సంఖ్యలో రైతులు, మహిళలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు