Monday, December 23, 2024
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిపార్లమెంట్ మార్చ్ విజయవంతం

పార్లమెంట్ మార్చ్ విజయవంతం

విభజన హామీలు అమలు చేయాలని డిమాండ్

పార్లమెంట్ మార్చ్ లో  పి ఎస్ యు రాష్ట్ర అధ్యక్షులు మంజుల నరేంద్ర
విశాలాంధ్ర ధర్మవరం: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ,ఏపీ కి ప్రత్యక హోదా విభజనహామీలు అమలు చేయాలనీ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, అధిక ధరలు తగ్గించాలని పేదరికం నిర్మూలించాలని కోరుతూ రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ,ఆర్ ఎస్ పి మరియు పి ఎస్ యు విద్యార్ధి సంఘం సెంట్రల్ కమిటీల ఆధ్వర్యంలో నవంబర్ 28 వ తేది దేశ రాజధాని ఢిల్లీలోజరిగిన పార్లమెంటు మార్చ్ విజయవంతంగా జరిగిందని పి ఎస్ యు రాష్ట్ర అధ్యక్షులు మంజు నరేంద్ర , సుబ్బారాయుడుతెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ కార్యక్రమం లో ఆర్ ఎస్ పి అగ్రనాయకత్వం పాల్గొన్నారు 2014లో మేకింగ్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా అనిచెప్పి దేశంలో బీజేపీ అధికారంలోకి  వస్తే , ప్రతి సంవత్సరం కోటి ఉద్యోగాలు కల్పించి,పేదరికానీ నిర్ములన చేస్తామని, అధిక ధరలు నియంత్రించి  పేదలకు అందుబాటులోకి తెస్తామని  ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది అన్నారు.అధికారం చేపట్టిన 10 సంవత్సరాలు పూర్తి అయినా విభజన హామీలు అమలు చేయలేకపోవడం దారుణం అన్నారు. అలాగే ఉద్యోగ కల్పనకోసం ఇచ్చిన హామీలు ఏ ఒక్కటీ అమలు చేయకపోగా  వున్న ప్రభుత్వ రంగ  సంస్థలను ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పి లక్షలాది మంది ఉద్యోగులను రోడ్డున పడే విధంగా చేయడం అన్యాయం అన్నారు. సెయిల్ ఆధ్వర్యంలో కడప ఉక్కు పరిశ్రమ నిర్మించాలని ,అలాగే రాష్ట్రవ్యాప్తంగా వివిధ పరిశ్రమల అభివృద్ధి కోసంగాని నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పనకు  కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయించాలని కోరారు. కావున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పై వత్తిడి తెచ్చి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పన కోసం, ధరలు నియంత్రణ కోసం,భవిష్యత్ లో పెద్ద ఎత్తున ఉద్యోమాలు చేస్తామని అన్నారు ఈకార్యక్రమంలో ఆర్ ఎస్ పి పి ఎస్ యు నాయకులు కళ్యాణ్, శ్రీనివాసులు, నందకిషోర్, గునవారన్, నరసింహ, భాస్కర్, గోపి రాంచరణ్, అనిల్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు