సిందూర్‌పై చర్చ సందర్భంగా రాజ్‌నాథ్
పహల్గాం ఉగ్రదాడిలో అమాయకులు బలయ్యారు. ఆత్మరక్షణమే కోసమే ఆపరేషన్ సిందూర్ చేపట్టాం. ఈ ఆపరేషన్‌తో అద్భుతమైన ఫలితాలను సాధించాం. ఉగ్రవాదులను అంతం చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం అని రక్షణ మంత్రి తెలిపారు. దేశం కోసం ప్రాణాలను త్యాగం చేసిన వీర సైనికులకు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈ సందర్భంగా నివాళులు అర్పించారు.
ఆపరేషన్ సిందూర్ ఆపాలని ఎలాంటి ఒత్తిడీ రాలేదని రాజ్‌నాథ్ స్పష్టం చేశారు. భారత సైనిక స్థావరాలపై దాడికి పాక్ యత్నించినట్లు చెప్పారు. పాక్ దాడులను సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టిందన్నారు. ముందుగా నిర్ణయించిన సైనిక లక్ష్యాలను సాధించినందుకే భారత్ తన చర్యను నిలిపివేసిందని రాజ్‌నాథ్ స్పష్టం చేశారు. ఎవరి ఒత్తిడితోనో ఆపరేషన్ నిలిపివేసినట్లు చెప్పడం సరికాదని వ్యాఖ్యానించారు. ాఉగ్రదాడిలో అమాయకులు బలయ్యారు. ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు న్యాయం చేయడానికే ఈ ఆపరేషన్ ప్రారంభించాం. సరిహద్దు దాటడం, అక్కడి భూభాగాన్ని స్వాధీనం చేసుకోవడం ఆపరేషన్ సిందూర్ లక్ష్యం కాదు. ఈ ఆపరేషన్ వెనుక ముఖ్య ఉద్దేశం పాక్ చాలాఏళ్లుగా పెంచి పోషిస్తున్న ఉగ్రవాదాన్ని నిర్మూలించడం అని రాజ్‌నాథ్ స్పష్టం చేశారు.
ఆపరేషన్ సిందూర్‌పై చర్చకు 16 గంటల చొప్పున ఉభయ సభలకు సమయం కేటాయించిన విషయం తెలిసిందే. సోమవారం లోక్‌సభ, మంగళవారం రాజ్యసభలో ప్రత్యేక చర్చ ప్రారంభం కానున్నది. లోక్‌సభలో ఈ చర్చ ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకే ప్రారంభం కావాల్సి ఉంది. అయితే, బీహార్‌లో ఓటర్ల జాబితా సవరణపై విపక్ష ఇండియా కూటమి ఎంపీల నిరసనతో సభ వాయిదా పడుతూ వచ్చింది. ఈ క్రమంలోనే సిందూర్‌పై చర్చ ఆలస్యంగా ప్రారంభమైంది. ప్రస్తుతం సభలో చర్చ కొనసాగుతోంది.


