Homeఆంధ్రప్రదేశ్దీర్ఘకాలిక ప్రయోజనాలే ల‌క్ష్యంగా  అభివృద్ధి పనులు

దీర్ఘకాలిక ప్రయోజనాలే ల‌క్ష్యంగా  అభివృద్ధి పనులు

- Advertisement -

రూ. 32 లక్షలతో  రోడ్డు నిర్మాణానికి శంఖుస్థాపన

విశాలాంధ్ర – రాజ‌మ‌హేంద్ర‌వ‌రం సిటీ  ; కూటమి ప్రభుత్వం దీర్ఘకాలిక ప్రయోజనాలతో అభివృద్ధి పనులు చేపడుతోందని, గత వైసీపీ పాలనలో చేసినట్లుగా హడావిడిగా పనులు చేసి చేతులు దులుపు కోవడం తమ విధానం కాదని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) స్పష్టం చేశారు. సోమవారం టీడీపీ  నాయకులతో కలిసి ఆయన రూ. 32 లక్షలతో శీలం నూకరాజు కల్యాణ మండపం వద్ద రోడ్డు నిర్మాణానికి శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ , ముగ్గుపేట నుంచి గోరక్షణపేట, గేదెల నూకరాజు లే అవుట్,  షెల్టాన్ వరకు అభివృద్ధి పనులుచేపట్టారని,  ఈ‌ మార్గంలో నిత్యం   భారీ వాహనాలు తిరగడం వల్ల ఎన్నిసార్లు వేసినా కల్వర్టు, రోడ్డు కుంగిపోతోందని సీనియర్ నాయకులు చెబుతున్నారని, దీనిని పక్కాగా నిర్మించేందుకు రూ. కోటి 50 లక్షలతో  నిర్మాణం చేపట్టామన్నారు. గోరక్షణపేట పైపులైన్ పనులు  పక్కాగా చేపట్టామని, దురదృష్టవశాత్తు ఈ పనులు జరిగేచోట ప్రమాదంలో సోదర సమానుడైన ఒకరిని కోల్పోయామని, ఆ కుటుంబాన్ని ఆదుకున్నామని ఆయన చెప్పారు. ఐదు నెలలుగా ఈ పనులు జరుగుతున్నాయని ఎందుకింత జాప్యం అని అధికారులను అడిగితే పైపులైన్ పనులు పూర్తయినా లోపల సర్దుకుందా లేదా అనేది పరిశీలించడానికి కనీసం 45 రోజులు వేచి చూడాలని అందుకే  పూడ్చి వేయకుండా ఆగామని అధికారులు చెప్పారని ఆయన వివరించారు. రోడ్లు కుంగిపోకుండా అన్ని పనులు ‌పక్కాగా చేస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం ఏపని చేసినా 50 ఏళ్ళు నిలిచేలా చేస్తుందని త్వరలో ఈ పైపులైన్ పనులు పూర్తి చేసి రోడ్డు కూడా వేస్తారని  చెప్పారు.  ఈ కార్యక్రమంలో నాయకులు కాశి నవీన్ కుమార్, వర్రే శ్రీనివాస్, మజ్జి రాంబాబు, కిలపర్తి శ్రీను, ఉప్పులూరి విశ్వనాధ్, కోకొనట్ వాసు, చెల్లుబోయిన సూర్యనారాయణ మూర్తి, శ్రీలత, కప్పల వెలుగు కుమారి, రాయి అప్పన్న బాబు, దాస్యం ప్రసాద్, సలాది ఆనంద్, ఆడారి లక్ష్మీ నారాయణ, రఫిక్ రాజా, వై దేవి ప్రసాద్, శ్రీనివాస్, శివారెడ్డి, చాపల చిన్న రాజు, వానపల్లి శ్రీనివాస్, నగర పాలక సంస్థ అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు