Homeఆంధ్రప్రదేశ్విజయవాడ మెట్రోకు టెండర్లకు ఆహ్వానం

విజయవాడ మెట్రోకు టెండర్లకు ఆహ్వానం

- Advertisement -
విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు ఆంధ్రప్రదేశ్ మెట్రోరైలు కార్పొరేషన్ కీలక ముందడుగు వేసింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన టెండర్లను ఈపీసీ (ఇంజినీరింగ్‌-ప్రొక్యూర్‌మెంట్‌-కన్స్ట్రక్షన్‌) విధానంలో ఆహ్వానించింది.మొదటి దశ (ఫేజ్‌-1)లో మొత్తం 38.4 కిలోమీటర్ల మేర రెండు కారిడార్లలో మెట్రో రైలు నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా,కారిడార్-1 నెహ్రూ బస్టాండ్‌ నుంచి గన్నవరం బస్టాండ్‌ వరకు ఏర్పడనుంది.

మెట్రో రైలు మార్గంలో మొత్తం 32 స్టేషన్ల ఏర్పాటు
ఇక కారిడార్-2 బస్టేషన్‌ నుంచి పెనమలూరు వరకు సాగనుంది. కారిడార్-1లో 4.7 కిలోమీటర్ల పొడవున డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్‌ను నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ మెట్రో రైలు మార్గంలో మొత్తం 32 స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. అదనంగా, ఒక ప్రత్యేక ప్రాంతంలో భూగర్భ మెట్రో స్టేషన్‌ కూడా నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, విశాఖపట్టణం మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించిన టెండర్లను ఇప్పటికే పిలిచిన సంగతి తెలిసిందే.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు