Home3 నెలల్లో స్పీకర్‌ నిర్ణయం

3 నెలల్లో స్పీకర్‌ నిర్ణయం

- Advertisement -

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై అనూహ్య తీర్పు
బీఆర్‌ఎస్‌ వాదనను తోసిపుచ్చిన సుప్రీం కోర్టు

విశాలాంధ్ర – హైదరాబాద్‌: తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టు అనూహ్యమైన తీర్పు వెలువరించింది. కేసు వేసిన బీఆర్‌ఎస్‌ వాదనను దేశ అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. మూడు నెలల నిర్దేశిత గడువులోగా ఎమ్మెల్యే ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోవాలని శాసనసభ స్పీకర్‌ను కోర్టు ఆదేశించింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్‌ఎస్‌ చేసిన విజ్ఞప్తిని సీజేఐ గవాయ్‌ తోసిపుచ్చారు. అలాగే గతంలో హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. స్పీకర్‌ నిర్ణయానికి కాలపరిమితి విధించాలనే అంశంపై పార్లమెంట్‌ నిర్ణయం తీసుకోవాలని గవాయ్‌ ఆదేశించారు. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసుపై గురువారం సుప్రీంకోర్టులో సుధీర్ఘ వాదనలు జరిగాయి. స్పీకర్‌ తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలనే అంశంలో కోర్టులు జోక్యం చేసుకోవచ్చా లేదా అనే దానిపై వాదోపవాదనలు నడిచాయి. ఈ ఏడాది ఏప్రిల్‌ మూడో తేదీన తీర్పును జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ ధర్మాసనం రిజర్వ్‌ చేసింది. ఈ నేపథ్యంలో గురువారం వెలువడిన తీర్పులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పదిమంది ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత చర్యలను వీలైనంత త్వరగా… అంటే మూడు నెలల్లోపు నిర్ణయించాలని, ఏ ఎమ్మెల్యే అయినా స్పీకర్‌ ప్రక్రియను పొడిగించాలని అడగకూడదని, అలా చేస్తే స్పీకర్‌ ప్రతికూల నిర్ణయాలు తీసుకోవచ్చన్నారు. రాజకీయ ఫిరాయింపులు జాతీయ చర్చనీయాంశంగా మారిందని, దాన్ని అరికట్టకపోతే ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే శక్తి దానికి ఉందని పేర్కొంది. ఈ అంశంపై పార్లమెంటులో చేసిన వివిధ ప్రసంగాలను కూడా పరిశీలించామని, రాజేశ్‌ పైలట్‌, దేవేంద్ర నాథ్‌ మున్షి… అనర్హత చర్యలపై స్పీకర్‌ నిర్ణయం తీసుకోవడం కోర్టుల ముందు జాప్యాన్ని నివారించడమే అవుతుందని అభిప్రాయపడిరది. పార్టీ మారిన వారిపై చర్యలు తీసుకునే అధికారం స్పీకర్‌కు కట్టబెట్టారని, ఆర్టికల్స్‌ 136, 226, 227 లకు సంబంధించి న్యాయ సమీక్ష అధికారాలు పరిమితంగా ఉన్నాయన్నారు. తెలంగాణ హైకోర్టు సింగిల్‌ జడ్జి ఆదేశాల్లో జోక్యం చేసుకోవడంలో డివిజన్‌ బెంచ్‌ తప్పు చేసిందని, స్పీకర్‌ ఒక న్యాయనిర్ణేత అధికారిగా వ్యవహరిస్తూనే హైకోర్టు, సుప్రీంకోర్టు అధికార పరిధికి లోబడి ఉండే ట్రిబ్యునల్‌గా వ్యవహరిస్తారని తీర్పులో స్పష్టం చేసింది. స్పీకర్‌ అలా వ్యవహరిస్తూనే రాజ్యాంగపరమైన రక్షణని పొందలేరంది. తెలంగాణ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ 2014లో తీర్పును పక్కన పెడుతున్నామని, ఒక ముఖ్యమైన నిర్ణయంలో శాసనసభ స్పీకర్‌లు ప్రజాస్వామ్యానికి ప్రమాదం కలిగించే ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకునే విషయంలో ఆలస్యం చేస్తారు కాబట్టి, ఫిరాయింపు నిరోధక చట్టం కింద ఎమ్మెల్యేల అనర్హతపై ప్రస్తుతం ఉన్న యంత్రాంగాన్ని పార్లమెంటు సమీక్షించాల్సిన అవసరం ఉందని చెప్పింది. ఇటువంటి చర్యలు సంవత్సరాల తరబడి సాగడం వల్ల అర్థరహితంగా మారుతుందని, ఈ అంశంపై సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసిన తర్వాత మాత్రమే స్పీకర్‌ నోటీసు జారీ చేయడం దురదృష్టకరమని పేర్కొంది. ఆపరేషన్‌ సక్సెస్‌- పేషెంట్‌ డైడ్‌’ అన్న సూత్రం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు అని సుప్రీంకోర్టు అభిప్రాయపడిరది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు