టిడిపి ఇన్చార్జి వీరభద్ర గౌడ్
ఉఅట్టహాసంగా పింఛన్లు పంపిణీ
విశాలాంధ్ర ఆస్పరి (కర్నూలు జిల్లా) : అర్హులందరికి ఎన్టీఆర్ హౌసింగ్ పథకం కింద ఇళ్లు నిర్మించి ఇస్తామని ఆలూరు టిడిపి ఇన్చార్జి వీరభద్ర గౌడ్ పేర్కొన్నారు. మండల పరిధిలోనే కారుమంచి గ్రామంలో సామాజిక పింఛన్ల పంపిణీని ఓ పండుగలా.. శని వారం అట్టహాసంగా నిర్వహించారు.ముందుగా స్థానిక టిడిపి నాయకులు వీరభద్ర గౌడు కు ఘనస్వాగతం పలికి, చాలువ పూలమాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం అధికారులు, కూటమి నాయకులు ఇంటింటికి వెళ్ళి ఎన్టీఆర్ సామాజిక భద్రత పింఛన్లను వీరభద్ర గౌడ్ చేతుల మీదుగా వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షల మేరకే కూటమి ప్రభుత్వం పని చేస్తుందని, అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు. ఎన్టీఆర్ గృహ పథకం కింద ఇంటిస్థలం ఉండి.. ఇళ్లు నిర్మించుకునేవారందరికి ఇళ్లు కట్టిస్తామని అన్నారు. సొంత ఇంటి స్థలంతో పాటు రేషనకార్డు కలిగి ఉండి, అర్హులైతే ఇళ్లు నిర్మించుకోవచ్చన్నారు. దీని కోసం గ్రామ, వార్డు స్థాయిల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు లబ్ధిదారులను గుర్తించాలన్నారు. అదే సమయంలో అక్రమాలకు పాల్పడితే ఎవరిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో గీతావాణి, సర్పంచ్ లక్ష్మి, టిడిపి మండల కన్వీనర్ పరమారెడ్డి, ప్రధాన కార్యదర్శి శేషాద్రి నాయుడు, మాజీ కన్వీనర్ శ్రీనివాస గౌడ్, సాగునీటి సంఘం మాజీ చైర్మన్లు మల్లికార్జున్ రెడ్డి, బసవరాజు, మార్కెట్ యార్డ్ మాజీ వైస్ చైర్మన్ సాలీ సాహెబ్, మాజీ ఎంపీటీసీ శివకుమార్, టిడిపి మండల నాయకులు రాజ్ కుమార్, సతీష్, హనుమంతురెడ్డి, మల్లికార్జున రెడ్డి, అంగడి వీరేష్, గ్రామ నాయకులు రవి రెడ్డి, మాణిక్య ప్రభు, లక్ష్మీదేవి, దర్గయ్య, చంద్ర, నాగరాజు, వెంకటేష్, జయకృష్ణ, రంగస్వామి, పంచాయితీ కార్యదర్శి కృష్ణ, వీఆర్వో ఎర్రిస్వామి, సచివాలయ సిబ్బంది, పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.