Homeజిల్లాలుఅనంతపురంవైసిపి ఇంచార్జీ రేసులో విఆర్ రామిరెడ్డి?

వైసిపి ఇంచార్జీ రేసులో విఆర్ రామిరెడ్డి?

- Advertisement -

విశాలాంధ్ర-తాడిపత్రి: తాడిపత్రి నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జ్ రేసులో నేను ఉన్నానంటూ తెరపైకి మరో నాయకుడు విఆర్.రామిరెడ్డి వచ్చాడు. రహస్యంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో మంతనాలు జరుపుతున్నట్లు ఆయన ముఖ్య అనుచరులు తెలిపారు. ముఖ్యంగా గతంలో విఆర్ రామిరెడ్డి తాడిపత్రి నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అంతేకాకుండా ఆయన హయాంలో కార్యకర్తలతో కలిసి వైసిపి అభివృద్ధి కొరకు కృషి చేశారు. అలాగే అధిష్టానం నియోజక వర్గ వ్యాప్తంగా పరిశీలించగా వైసీపీ కార్యకర్తలు వైసిపి తాడిపత్రి నియోజకవర్గ ఇన్చార్జిగా విఆర్ రామిరెడ్డి నాయకత్వాన్ని కోరుకుంటున్నట్లు, ఆయన అనుచరులు చెప్పారు. ప్రస్తుత వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి నియోజకవర్గానికి రాలేకపోతుండడంతో విఆర్. రామిరెడ్డి వైసీపీ ఇన్ఛార్జ్ పదవిని తీసుకొని నియోజకవర్గంలో వైసీపీని బలోపేతం చేస్తారని ఆయన అనుచరులు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు