విశాలాంధ్ర-తాడిపత్రి: టూ వీలర్ మెకానిక్స్ సంక్షేమమే తమ ధ్యేయం అని నవ్యాంధ్ర టూ వీలర్ మెకానిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపకుడు షేక్ సుభాని పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని అబ్దుల్ కలాం షాది ఖానాలో నవ్యాంధ్ర టూ వీలర్ మెకానిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నవ్యాంధ్ర టూ వీలర్ మెకానిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపకుడు షేక్ సుభాని అనంతపురం జిల్లా ఇంచార్జ్ షేక్ రియాజ్ భాష, సలహాదారుడు మురళి రెడ్డి, ఆర్గనైజర్ ప్రెసిడెంట్ జాఫర్, సెక్రటరీ లాలుస్వామి తాడిపత్రి ఇంచార్జ్ అన్వర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా షేక్ సుభాని మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది టూ వీలర్ మెకానిక్స్ ఉన్నారని, ప్రస్తుతం విద్యుత్ వాహనాలు రావడంతో టూ వీలర్ మెకానిక్స్ కు గత కొంతకాలం నుండి పనులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కావున టూ వీలర్ మెకానిక్స్ కు వడ్డీ లేని రుణాలు ఇప్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శింగనమల మెకానిక్ దస్తగిరి, కిరణ్ కుమార్ రెడ్డి, లక్పతి, గౌస్, మణి, ఓబిరెడ్డి, మహమ్మద్, రఫీ, మాభాష సాహెబ్, జాఫర్ తదితరులు పాల్గొన్నారు.


